Licenses Cancelled: చేవెళ్ల యాక్సిడెంట్ ఎఫెక్ట్.. ఇకపై అలా చేస్తే లైసెన్స్ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం!

రాష్ట్రంలో వరుస ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించే భారీ వాహనాల డ్రైవర్లు, యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఓవర్‌ లోడ్‌తో వెళ్లే టిప్పర్లు, లారీలను సీజ్‌ చేసి, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయాలని నిర్ణయించారు.

New Update
FotoJet - 2025-11-08T121436.681

Overloaded Truck

Licenses Cancelled: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాల(road  accidents) నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. నిబంధనలు అతిక్రమించే భారీ వాహనాల డ్రైవర్లు, యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు(road transport department) చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.

ఇటీవల  చేవెళ్ల సమీపంలో టిప్పర్‌-ఆర్టీసీ బస్సు ప్రమాద(chevella accident lorry) ఘటన తెలిసిందే. ఈ ఘటనలో కంకర లోడ్‌తో వెళుతున్న టిప్పర్‌(vehicles)పై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని. అలాగే ప్రమాద తీవ్రత, మృతుల సంఖ్య పెరగడానికీ టిప్పర్‌ ఓవర్‌లోడే కారణం అని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గతంలో జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మటుకు ఓవర్‌లోడ్‌ కారణంగానే జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఓవర్‌లోడ్‌ కారణంగా వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోతాడని, దానివల్ల బ్రేకులు పడకపోవడంతో, మలుపుల వద్ద వాహనాలు అదుపు తప్పడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది.  అందువల్ల ఇకపై ఈ తరహా ఘటనలు తగ్గించేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. 

Also Read :  అర్థరాత్రి ఎర్రగడ్డలో హై టెన్షన్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

Chevella Accident Effect - Licenses Cancelled

ఈ క్రమంలో ఓవర్‌ లోడ్‌తో వెళ్లే టిప్పర్లు, లారీలను సీజ్‌ చేసి, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతిసారి ఉల్లంఘనలకు పాల్పడితే వాహన పర్మిట్‌ను కూడా రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఓవర్‌లోడ్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డైవర్‌తో పాటు వాహన యజమానిపైనా చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలనే అంశాన్ని కూడా రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికోసం భారీ వాహనాల యాజామాన్యాలతో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

అందులో భాగంగా త్వరలో మైనింగ్‌ శాఖ అధికారులతో సమావేశమై వాహనాలకు లోడ్‌ వేసే రీచ్‌లు, క్వారీల్లోనే ఓవర్‌ లోడ్‌ అరికట్టే విధంగా చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో మొత్తం 1.75 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయని తేలింది. వీటిలో నిర్మాణ సామగ్రి, సరుకులు తరలించే వాహనాలు 6.65 లక్షలకుపైగానే ఉన్నాయి. ప్రమాదాలకు అవకాశం ఉన్న రోడ్లపై భారీ వాహనాలు పరిమిత వేగాన్ని పాటించడంతో పాటు, అవి నిర్ణీత లోడుతో ప్రయాణించేలా చర్యలు చేపడితే ప్రమాదాలను నివారించవచ్చన్న అభిప్రాయం ఉందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అనుకోని ప్రమాదం జరిగినా ప్రమాద తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారుల ఆలోచిస్తున్నారు.

ఇక  చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రవాణా శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 245 వాహనాలపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం గమనార్హం. మరో 180 వాహనాలను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన వాహనాల్లో 40 ఓవర్‌ లోడ్‌తో కూడుకున్నవి  కాగా. మిగతావి ఫిట్‌నెస్‌ రహిత, టాక్స్‌, పర్మిట్‌ తదితర పత్రాలు సరిగా లేని వాహనాలు ఉన్నాయి. కాగా నిబంధనలు అతిక్రమించే వాహనాలపై  ఇక మీదట నిరంతర దాడులు కొనసాగుతాయి. పగటి సమయంతోపాటు రాత్రివేళ తనిఖీలు ముమ్మరం చేస్తాం. సరైన పత్రాలు లేని, ఓవర్‌లోడ్‌ వాహనాలు రోడ్లపైకి వస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని’ రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read :  కేటీఆర్‌, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్‌.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు