/rtv/media/media_files/2025/08/20/early-morning-2025-08-20-08-05-05.jpg)
Early Morning
ఉదయం లేచిన తర్వాత ఖాళీ కడుపుతో కొందరు కొన్ని పదార్థాలను తీసుకుంటారు. వీటివల్ల కడుపు సంబంధిత సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట పోషకాలు ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని నిపుణులు అంటున్నారు. కొందరు తెలిసో తెలియక ఉదయాన్నే కొన్ని పదార్థాలను తీసుకుని అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే ఖాళీ కడుపుతో ఉదయాన్నే తీసుకోకూడని పదార్థాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Cigarette: ఈ మూడు అలవాట్లు ఎక్కువ డేంజర్.. నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోండి..!!
సిట్రస్ పండ్లు
కొందరికి తెలియక ఖాళీ కడుపుతో నిమ్మకాయలు, ద్రాక్ష, నారింజ వంటి సిట్రస్ పండ్లు తీసుకుంటారు. వీటిలో ఎక్కువగా సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇవి కడుపు సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయని, అసలు ఉదయం పూట వీటిని తినకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
టమాటాలు
వీటిలో సిట్రిక్ యాసిడ్‌తో పాటు మాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్ట్రిక్, గుండె సమస్యలు వంటివి వస్తాయని, అసలు ఖాళీ కడుపుతో తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
కాఫీ
చాలా మందికి ఖాళీ కడుపుతో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి బాగా పెరుగుతుందని, దీని వల్ల వికారం, చిరాకు, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
మసాలా దినుసులు
మసాలా ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్టలో అల్సర్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సాఫ్ట్ డ్రింక్స్
ఖాళీ కడుపుతో సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. వీటివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుందని చెబుతున్నారు. ఉదయం పూట వీటి కంటే గోరువెచ్చని నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
చాక్లెట్లు
వీటిని ఉదయం పూట తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చాక్లెట్‌లో కెఫిన్‌తో పాటు థియోబ్రోమిన్ ఉంటుంది. ఇవి కడుపులో ఆమ్లాని పెంచి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వచ్చేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేయించిన పదార్థాలు
ఉదయాన్నే సమోసా, వేపుడు పదార్థాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి కొందరు తింటారు. వీటిలో అనారోగ్యమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు వచ్చేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉల్లిపాయ
ఏం తినకుండా ఉదయం పూట ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో తీసుకుంటే పర్లేదు. కానీ కేవలం వీటిని మాత్రం డైరెక్ట్‌గా అసలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Vitamin B2, B12 Deficiency Symptoms: పెదాల పగులుతో ఇబ్బందిగా ఉందా..? అయితే విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి!!