/rtv/media/media_files/2025/11/14/fotojet-94-2025-11-14-18-06-34.jpg)
Candidate dies of heart attack before counting.. How many votes did he get..?
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(jubilee hills by elections 2025)ల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటు(heart attack incident)తో మృతి చెందారు. దీంతో, ఒకవైపు గెలిచిన అభ్యర్థి విజయోత్సవాలు జరుపుకుంటుంటే. ఓడిన అభ్యర్థి వర్గం శిభిరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ncc) నుంచి మహమ్మద్ అన్వర్ పోటీ చేశారు. అయితే, ఈరోజు కౌంటింగ్ ఉండగా ఆయన ఉదయమే గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, వారి కుటంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మహమ్మద్ అన్వర్ ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఛాతీ నొప్పి ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
Also Read : పనిచేయని బీఆర్‌ఎస్ ప్రచారం..వీగిపోయిన హైడ్రా..రౌడీ అస్త్రాలు
Candidate Dies Of Heart Attack Before Counting
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అభ్యర్థి మహ్మద్ అన్వర్ ఈ ఉప ఎన్నికలో 24 ఓట్లు సాధించాడు. ఆయన పోల్ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నప్పుడు ఛాతీ నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అన్వర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
Also Read : కిషన్ రెడ్డి పద్ధతి మార్చుకో.. KTR అహంకారం తగ్గించుకో.. సీఎం రేవంత్ వార్నింగ్!
Follow Us