/rtv/media/media_files/2025/10/22/big-shock-to-naveen-yadav-2025-10-22-17-51-52.jpg)
Jubilee Hills By Election 2025 Results
Jubilee Hills By Election 2025 Results : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్లుగానే ప్రచారం సాగింది. కాగా ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు, హడ్రా, నవీన్ వ్యక్తిగత జీవితం పై విస్తృత ప్రచారం చేసింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మహిళలకు రూ.2500, వృద్ధులు, వికలాంగుల పింఛన్ పెంపు తదితర అంశాలను డిజిటల్ స్క్రీన్ తోప్రచారం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేసింది.
అంతేకాక హైడ్రా తో పేదల ఇండ్లు కూల్చివేస్తారని, దాన్ని అడ్డుకునేది కారు మాత్రమేనని ప్రచారం చేశారు. కాంగ్రెస్ గెలిస్తే బుల్డొడర్ వస్తుందని, బీఆర్ఎస్ గెలిస్తే కారు వస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇండ్లు కోల్పోయిన వారి ఆక్రోశాన్ని కూడా ప్రచారం చేశారు. అయినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.
ఇక నవీన్‌యాదవ్ కుటుంబపై ఉన్న ప్రచారాన్ని కూడా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హైలెట్ చేసింది. ముఖ్యంగా నవీన్‌యాదవ్ తండ్రి చిన శ్రీశైలం యాదవ్ మీద ఉన్న రౌడీ షీట్‌ను పదే పదే ప్రచారం చేసింది. వారు గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుందని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. మీకు రౌడీ కావాలా లేక లేడీ కావాలా అంటూ బీఆర్‌ఎస్ చేసిన ప్రచారం జోరుగానే సాగినప్పటికీ ప్రజలు అంతగా పట్టించుకోలేదనే తెలుస్తోంది. దీనితో పాటు భర్తను కోల్పోయిన మహిళ, తండ్రిని కోల్పోయిన పిల్లలు అంటూ సెంటిమెంట్‌ప్రచారం చేసినప్పటికీ ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. వీటన్నింటిని కాదని నవీన్ యాదవ్‌కే పట్టం కట్టారు.
కాంగ్రెస్ పార్టీ గడచిన రెండు సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా ప్రచారం చేసింది. ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం తదితర అంశాలను ప్రధానంగా ఎన్నికల్లో చెప్పుకుంది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ కుటుంబ వ్యవహారాన్ని హైలెట్ చేయడంలో ఒక రకంగా విజయం సాధించిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగడం కూడా పార్టీ విజయానికి ఉపకరించింది.
మరోవైపు బీఆర్‌ఎస్ సానుభూతి ఓట్లు పడుతాయనే నమ్మకంతో రంగంలోకి దింపిన మాగంటి సునీత బలహీన అభ్యర్థి అని మొదటి నుంచే ప్రచారం సాగింది. దానికి తగినట్లే ఆమె ప్రసంగం కూడా ఎక్కడ ఆకట్టుకోలేకపోయింది. ఇది కూడా నవీన్‌కు కలిసి వచ్చిందనే చెప్పాలి. అలాగే గోపినాథ్ మొదటి భార్య విషయంలో గోపినాథ్ తల్లి, చేసిన ఆరోపణలు కూడా సునీత ఓటమిపై ప్రభావం చూపాయనే చెప్పాలి.
నవీన్ యాదవ్‌కు తను చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి విషయంలోనూ కలచి వచ్చింది. దీనికి తోడు కార్పోరేటర్‌గా, ఎమ్మెల్యేగా వరుస అపజయాలు కూడా ఆయనపై సానుభూతి కలిగించడానికి ఉపకరించాయి. దీంతో బీఆర్‌ఎస్ అస్త్రాలైన హైడ్రా, రౌడీ ప్రచారాలు వీడిపోయాయి.
Also Read : నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?
Follow Us