/rtv/media/media_files/2026/02/18/fotojet-16-2026-02-18-08-24-01.jpg)
Call for a bandh in Kyatanapalli today
Kyatanapalli : మంచిర్యాల జిల్లా(manchiryala-district) క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం కోసం అధికార కాంగ్రెస్(congress) పార్టీ పావులు కదుపుతోంది. నిజానికి వారికి పూర్తి మెజారిటీ లేకపోయినప్పటికీ సీపీఐ మద్ధతును కూడగట్టి పీఠాన్ని చేజిక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. దీనికోసం రెండు రోజులుగా హైడ్రామా కొనసాగుతోంది. రెండు రోజులు పూర్తి కోరం ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేయడాన్ని బీఆర్‌ఎస్, సీపీఐ వ్యతిరేకిస్తున్నాయి. నిన్న ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణను స్థానిక నేతలు అడ్డుకున్నారు. మంత్రి కాన్వయ్ పై రాళ్ల వర్షం కురిపించారు. అయితే చివరికి ఎన్నిక జరగకుండానే వాయిదా వేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ దౌర్జన్యాలు.. నీచపు రాజకీయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీతోపాటు సీపీఐ బంద్‌కు పిలుపునిచ్చాయి.
Also Read : మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్మన్, వైస్ ఛైర్మన్ల జీతం ఎంతో తెలుసా?
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/18/fotojet-17-2026-02-18-08-24-36.jpg)
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి(Kyatanapalli Municipality) లో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, బీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయి కోరం ఉన్నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ బరితెగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. కౌన్సిల్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్(brs), సీపీఐ(cpi) మహిళా కౌన్సిలర్లపై మంత్రి వివేక్(Balka Suman Fires On Minister Vivek) ముందే మద్యం మత్తులో కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రమాణ స్వీకార అనంతరం గొడవ జరుగుతుండగానే మంత్రి వివేక్, ఎంపీ వంశీ అక్కడినుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీనికి నిరసనగా మూడు గంటల పాటు బీఆర్‌ఎస్- సీపీఐ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం లోపలే బైఠాయించి నిరసన తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్‌లో ఆడబిడ్డలపై మీద కాంగ్రెస్ దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ బీఆర్‌ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీఆర్‌ఎస్, సీపీఐ పార్టీలు తెలిపాయి.
Also Read : రెండు కోట్ల బీమా కోసం దారుణం.. స్నేహితుడి చంపేందుకు కుట్ర
ఏం జరిగింది?
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డులను బీఆర్‌ఎస్ పార్టీ, సీపీఐ కూటమి గెలిచింది. ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్, సీపీఐ ఎన్నిక కావాల్సి ఉంది, అయితే అధికార కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది. మెజార్టీ లేకపోయినా మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలని కుట్ర.. దౌర్జన్యం.. అధికార బలంతో రాజకీయం చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తుంది. దీంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీతోపాటు సీపీఐ కౌన్సిలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందంటున్నారు. దీంతో మున్సిపల్ కార్యవర్గం ఎన్నిక రెండు సార్లు వాయిదా పడింది. రెండో రోజు మంగళవారం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం.. అధికారులకు కూడా వంతపాడడం.. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ, సీపీఐ క్యాతన్‌పల్లి బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ బంద్ ప్రభావంతో నేడు క్యాతన్‌పల్లిలో ఉన్న స్కూళ్లు, కాలేజ్‌లు కూడా బంద్ కానున్నాయి. ఇప్పటికే క్యాతన్‌పల్లి లో రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల కవాతుతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెద్ద ఎత్తున బలగాలు మోహరించడంతో క్యాతన్‌పల్లిలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలు ఏర్పడిన నేపథ్యంలో ఇచ్చిన బంద్‌తో ఇబ్బందులు ఎదురవుతాయని స్కూళ్లు, కాలేజ్‌లు బుధవారం పనిచేయకపోవచ్చు.
Follow Us