/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
KTR : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనరాదని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయద్దని ఆయన పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎవరూ ఓటు వేయకుండా విప్ జారీ చేస్తామని, విప్ ను ధిక్కరిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సమావేశాల సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో ఏ ఎన్నికలు వచ్చినా మనమే గెలిచే వాళ్ళం.. మొన్న 2023లో కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల అన్ని స్థానాలు మనమే గెలిచాం.. హైదరాబాద్ వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి మనల్ని గెలిపించారు..నగరంలో అన్ని స్థానాల్లో మనల్ని గెలిపించి ఆదరించారన్నారు. ఔటర్ అవతల ఉన్న వాళ్లు కాంగ్రెస్ మాటలకు మోసపోయారు అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ అరాచకం చేస్తుంది.. హైడ్రాతో పేదలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవు అంటూనే.. మూసి సుందరీకరణ చేస్తాను అంటున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుఫాను వేగంతో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఉండి చేసిందేం లేదన్నారు. కేంద్రంలో ఒక సహాయ మంత్రి, మరో నిస్సహాయ మంత్రి ఉండి ఎలాంటి లాభం లేదు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కంచె గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటే.. అందరూ ఎంపీలు భుజాలు తడుముకుంటున్నారు.. బయటకు వచ్చి బీజేపీ ఎంపీలు నన్ను తిడుతున్నారు.. సోనియా, రాహుల్ గాంధీల మీద చార్జ్ షీట్ వేస్తే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన చేశారు.. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడలేదు.. బీజేపీ, నరేంద్రమోడీతో చోట భాయ్- బడా భాయ్ బంధం ఉంది కాబట్టే రేవంత్ మాట్లాడడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడుతూ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు అన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దు.. ఎవరూ ఓటుకు వెళ్లకుండా విప్ కూడా ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరూ ఓటు వేయడానికి వెళ్లొద్దని సూచించారు. ఎవరైనా విప్ ధిక్కరించి ఓటింగ్ కు వెళితే వారిపై చర్యలు తీసుకుంటాం.. ఓటు ఉన్న వాళ్లకు విప్ ఇవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డిలను కేటీఆర్ కోరారు.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు