Yarlagadda Venkata Rao : యార్లగడ్డను వైసీపీ అవమానించిందా? పొమ్మనలేక పొగపెట్టిందా?
వైసీపీకి గుడ్ బై చెప్పారు గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా యార్లగడ్డ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని యార్లగడ్డ తేల్చి చెప్పారు.