New Liquor Policy: మందు బాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై హాటల్స్‌లో కూడా బీర్ల అమ్మకాలు

తెలంగాణ ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి అనుమతించింది. ఇది మందుబాబులకు, ముఖ్యంగా బీర్ లవర్లకు గుడ్‌న్యూస్. కొత్తగా మైక్రో బ్రూవరీ పాలసీ తీసుకొచ్చింది. అంటే ఇక నుంచి ఆసక్తి ఉన్న వారు ఎవరైనా బీర్లు తయారు చేసుకోవచ్చు.. విక్రయించవచ్చు.

New Update
beer

New Liquor Policy update

New Liquor Policy: తెలంగాణ(Telangana) ప్రభుత్వం నూతన మద్యం పాలసీకి అనుమతించింది. ఇది మందుబాబులకు, ముఖ్యంగా బీర్ లవర్లకు(Telangana Beers) గుడ్‌న్యూస్. కొత్తగా మైక్రో బ్రూవరీ పాలసీ తీసుకొచ్చింది. అంటే ఇక నుంచి ఆసక్తి ఉన్న వారు ఎవరైనా బీర్లు తయారు చేసుకోవచ్చు.. విక్రయించవచ్చు. వెయ్యి గజాల స్థలం ఉంటే చాలు మైక్రో బ్రూవరీలను పెట్టుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ షాపుల్లోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పర్యాటక ప్రదేశాల్లో బీర్లు అమ్మకాలు చేయవచ్చు. మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసుకోవాలంటే 1000 గజాల స్థలం ఉండి.. రూ.లక్షలతో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతులు పరిశీలించి మంజూరు చేస్తారు. ఇక బీర్లు కావాలంటే వైన్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.. తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ బీర్ దొరకబోతుంది. 

Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే మైక్రో బ్రూవరీల నిర్వహణకు అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ 18 మైక్రో బ్రూవరీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా విస్తరించాలని ఆబ్కారీ శాఖ తాజా నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించింది. 

Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR)తో పాటు కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. TCUR పరిధిలోని జీహెచ్ఎంసీ, బోడుప్పల్, జవహర్ నగర్, పీర్జాదిగూడ, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, మీర్ పేట్ పరిధిలో కూడా మైక్రో బ్రూవరీలకు దరఖాస్తుల స్వీకరిస్తారు. నిబంధనల ప్రకారం ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్ని అనుమతులు ఇస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

Also Read: మోదీతో కారులో మాట్లాడిన సీక్రెట్ లీక్ చేసిన పుతిన్

ప్రతిపక్షం వ్యతిరేకత

మరోవైపు ఈ నూతన మద్యం పాలసీపై ప్రతిపక్షం మండిపడుతోంది. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ పాలసీని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తెస్తుందని అంటే ఏదో గొప్పగా ఉంటుంది అనుకున్నాం. మద్య నిషేధం ప్రకటిస్తారేమో అని అనుకున్నాం. కానీ ఇలా ఊరికో కంపెనీ పెట్టి అందరితీ బీర్లు తాగించేలా చేస్తోందని అనుకోలేదని ఆయన అన్నారు. యువతను మద్యం మత్తులోకి దించేలా ఉంది ఈ పాలసీ ఉందని బీఆర్ఎస్ లీడర్ అంటున్నారు. బెల్ట్ షాపులు ఎత్తి వేస్తామని చెప్పి వాటి సంఖ్య పెంచుతున్నారు. ఆదాయం పెంచుకునే పేరిట విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతి ఇవ్వబోతున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మైక్రో బ్రూవరీల ఏర్పాటు ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు