SSMB29: మహేష్ బాబు 'SSMB29' నుంచి సీన్ లీక్.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అంతే!

మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'SSMB29'. దీంతో మూవీకి సంబంధించిన  అప్డేట్స్ కోసం ఆసక్తిగా  అని ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

New Update
SSMB29

SSMB29

SSMB29: మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'SSMB29'. దీంతో మూవీకి సంబంధించిన  అప్డేట్స్ కోసం ఆసక్తిగా  అని ఎదురుచూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ క్రమంలో  'SSMB29' సెట్స్ నుంచి లీకైన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కెన్యాలోని నైరోబీలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే  ఇటీవలే రాజమౌళి చిత్రబృందం ఈస్ట్ ఆఫ్రికాలోని కెన్యాలో కీలక సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేశారు. ఇందులో భాగంగానే ఈ ఫొటో లీకైనట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్ పూర్తవగా.. ఇటీవలే 3వ షెడ్యూల్ కెన్యాలో పూర్తయింది. సినిమాలో ఆఫ్రికన్ సీన్స్ కి సంబంధించిన 95 శాతం షూటింగ్ కెన్యలోనే చిత్రీకరించారట. ఈ మేరకు షూటింగ్ అనంతరం రాజమౌళి కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదవాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. షూటింగ్ కావాల్సిన పర్మిషన్స్ కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కెన్యా విదేశంగా మంత్రి ముసాలియా కూడా తమ దేశంలోని సుందరమైన ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. 

120 దేశాల్లో విడుదల 

SSMB 29 రాజమౌళి ఇంటర్ నేషనల్ స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ ఉన్నారు. దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మహేష్ బాబు ఒక గ్లోబ్ ట్రాటర్ గా కనిపించే.. ఈ చిత్రం 'ఇండియానా జోన్స్' లాంటి ఒక యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందని సమాచారం. అంటే ఒక ట్రావెలర్ అని అర్థం. అయితే ఈ సినిమా కథ ఎక్కువగా ఆఫ్రికన్ అడవుల్లో సెటప్ అయ్యి ఉంటుంది. అందుకే ఈస్ట్ ఆఫ్రికాలోని కొన్ని సుందరమైన ప్రదేశాల్లో సినిమాను చిత్రరీకరించారు. 

ఇందులో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో రూపండుతున్న ఈ చిత్రాన్ని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది 2027 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న మొదటి సినిమా ఇది. దీంతో  ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే RRR,    బాహుబలి, వంటి చిత్రాల తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 

Also Read: Ghaati Advance Ticket Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'ఘాటీ' సంచలనం.. హాట్ కేకుల్లా టికెట్లు !

Advertisment
తాజా కథనాలు