మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ముఖ్యంగా పేదలు, యువకులు, రైతులు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. స్కిల్ సెన్సస్, స్టార్టప్‌లను అభివృద్ధి చేసేందుకు శివాజీ మహారాజ్ కేంద్రం, ఇంక్యుబేషన్ సెంటర్లు అలాగే వడ్డీ లేని రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు విపక్ష కూటమి మహా వికాస్ అఘాడిపై అమిత్ షా తీవ్రంగా విమర్శలు చేశారు. విపక్ష కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో సుస్థిరమైన పాలన ఉండాలంటే మహాయుతి కుటమే అధికారంలో కొనసాగాలన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలు, వర్గాలకు సమానంగా ప్రాధాన్యం ఇచ్చామని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రాన్ని వికసిత్ మహారాష్ట్రగా తీర్చిదిద్దేందుకు రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశామని స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
మేనిఫెస్టోలో కీలక అంశాలు
1.యువతకు 25 లక్షల ఉద్యోగాలు
2.రాష్ట్రంలో మరిన్ని ఉపాధి ఉద్యోగాలు అందించే దిశగా స్కిల్ సెన్సస్
3.ప్రస్తుతం 11 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్న లఖపతి దీదీ పథకాన్ని 50 లక్షల మంది మహిళలకు విస్తరించి.. వాళ్లని ఆర్థికంగా 4.బలోపేతం చేయడం
5.రైతులు ఎరువులపై చెల్లించిన జీఎస్టీని తిరిగి చెల్లించి, వాళ్ల ఆర్థిక భారాన్ని తగ్గించడం
6.పారిశ్రామిక అభివృద్ధి పెంపొందించేందుకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు
7.రైతులకు రుణమాఫీ చేయడం
8.వృద్ధులకు అందించే నెలవారీ పెన్షన్ రూ.1500 నుంచి రూ.2100కు పెంపు
9.నిత్యావసర వస్తువల ధరలు స్థిరంగా ఉంచడం
Also Read: ధరణి స్కామ్.. రూ. 60వేల కోట్ల ప్రభుత్వ భూములు స్వాహా!
ఇదిలాఉండగా.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడుతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ, శివసేన(షిండే వర్గం) , ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)తో కూడిన మహాయుతి కూటమి అధికారంలో ఉంది. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ)లతో కూడిన విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కూడా ఈసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని పోరాటం చేస్తోంది.
ఇది కూడా చూడండి: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
ఇది కూడా చూడండి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు