హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ హైదరాబాద్‌లో అశోక్ నగర్, మదీనాగూడ, మియాపూర్, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట ప్రాంతాల్లో రేపు నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. మరమ్మత్తుల దృష్ట్యా 24 గంటల పాటు నీరు సరఫరా ఉండదు. By Kusuma 10 Nov 2024 in హైదరాబాద్ తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 11వ తేదీన సోమవారం తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. ఇది కూడా చూడండి: కొరటాల శివ నెక్స్ట్ సినిమాకు భారీ ప్లాన్.. మలయాళ స్టార్ హీరో కొడుకుతో.. ఈ ఏరియాల్లో నీటి సరఫరాకి అంతరాయం.. ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట, జగద్గిరిగుట్టలో నీటి సరఫరాకి అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-2లోని పైపులు ఎక్కువగా లీకులు అయ్యాయి. దీంతో భారీగా నీరు వృథా కావడంతో ఈ లీకేజీలను అరికట్టేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. పూర్తిగా ఒక రోజు మొత్తం నీరు సరఫరా నిలిచిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరమ్మత్తుల చేసినంత వరకు దీనికి ప్రత్యామ్నాయంగా నీటిని చూసుకోవాలని అధికారులు తెలిపారు. గ్రామాల్లో అయితే బోరింగ్‌లు, బావులు ఉంటాయి. కానీ పట్టణాల్లో ఇవి ఉండటం కాస్త కష్టమే. ఇది కూడా చూడండి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎక్కడో ఒక దగ్గర బావులు ఉంటాయి. కానీ వీటిని ఎక్కువ రోజుల నుంచి వినియోగించకపోవడం వల్ల ఇందులోని నీరు మంచిగా ఉండవు. చెత్త అన్ని ఉండటంతో పాటు నీరు కూడా కలుషితం అయి ఉంటుంది. ఇలాంటి వాటర్ వాడటం వల్ల మళ్లీ అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి నీరు విషయంలో జాగ్రత్తలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి #water-supply #no water supply on hyderabad #water supply on hyderabad #water #hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి