Bandi Sanjay : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..  మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు పోటీ... బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్ అని అన్నారు.

New Update
sanjay

కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(jubliee hills by election) హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్ అని అన్నారు. బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్ల, మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు మధ్య పోటీ అని చెప్పారు. ఈ ఎన్నికలలో 80% ఉన్న హిందువులు గెలుస్తారా లేదంటే 20% ఉన్న ముస్లింలు గెలుస్తారా?  హిందువుల పక్షాన బీజేపీ, ముస్లింల వైపు కాంగ్రెస్ ఉందన్నారు. తెలంగాణని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకు సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. 

Also Read :  తెలంగాణలో మరో బస్సు ప్రమాదం..స్పాట్‌లో...

ముస్లిం టోపీ ధరించడంపై

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముస్లిం టోపీ ధరించడంపై  ఇప్పటికే బండి సంజయ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఓట్ల కోసం ఒకవేళ నేను ఎప్పుడైనా టోపీ పెట్టుకోవాల్సి వస్తే, తాను తలనే నరుక్కుంటానని అన్నారు. కచ్చితంగా తానూ హిందువునని చెప్పిన సంజయ్..  ఇతర మతాలను అవమానించేలా నమాజ్ నటించనని సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు గోదావరిఖనిలో రోడ్డు విస్తరణలో భాగంగా 46 హిందూ ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్‌ స్పందించారు. అమ్మవారి ఆలయాలను ఎలా కూల్చేశారో.. అలాగే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని  బండి సంజయ్‌  స్పష్టం చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయనహెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోగానే తానే స్వయంగా గోదావరిఖని వస్తానని.. అధికారుల సంగతి తేలుస్తానన్నారు సంజయ్. ఆలయాలను కట్టించకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయిస్తానంటూ సంజయ్ కామెంట్స్ చేశారు.  

Also Read :  సీఎం..నీ వీధి రౌడీ భాష మార్చుకో!..కవిత మాస్‌ వార్నింగ్‌

Advertisment
తాజా కథనాలు