/rtv/media/media_files/2025/11/09/fotojet-2025-11-09t092819-818-2025-11-09-09-29-06.jpg)
CM.. Change your street rowdy language!.. Kavitha's mass warning
Kalvakuntla Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, యాజమాన్యాల తాట తీస్తామని వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు
సీఎం వీధి రౌడీ భాషను మార్చుకోవాలని, తాట, తోలు తీస్తానని మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా సీఎం మాట్లాడారని దుయ్యబట్టారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపట్టిన ‘జాగృతి జనంబాట’లో భాగంగా హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం తెలంగాణలో కాలేజీలను పెట్టకపోతే.. లోన్లు తీసుకుని పైసా పైసా పెట్టి ఇక్కడ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ విద్యార్థులకు విద్యను అందించినందుకు వారి తాట తీస్తారా? అని ప్రశ్నించారు. కళాశాలల యాజమాన్యాల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొందరు విద్యార్థులు తన దగ్గరకు వచ్చి కలిసారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించి, వారి చదువు ఆగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు.రాష్ట్రంలో 1,800 కాలేజీలుంటే.. రెండు కాలేజీల పేర్లే సీఎం చెప్పారని, ఆ రెండు కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అనుమతులు ఇవ్వొద్దన్నారు. కానీ, మిగతా కాలేజీలు ఏం తప్పు చేశాయని ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పి వారినెలా బెదిరిస్తారంటూ సీఎంను ప్రశ్నించారు. తక్షణం రేవంత్ రెడ్డి వారికి క్షమాపణ చెప్పాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు ఇస్తున్నారని, ఈ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కళాశాలల యాజమాన్యాల పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. తన మాటే జీవోతో సమానమన్న రేవంత్.. వరంగల్ వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చి 15 రోజులైనా ఇప్పటికీ నయా పైసా నిధులు ఇవ్వలేదన్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు ఇస్తున్నారని, ఈ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కళాశాలల యాజమాన్యాల పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.యాజమాన్యాలకు మద్దతుగా తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేస్తామన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న విషయం తెలిసిందే.
Also Read: మీ తాటతీస్తాం.. వాళ్లకు పవన్ కళ్యాణ్ లాస్ట్ వార్నింగ్
Follow Us