/rtv/media/media_files/2025/11/09/fotojet-2025-11-09t100246205-2025-11-09-10-03-16.jpg)
Another bus accident in Telangana
BREAKING: సంగారెడ్డి జిల్లా కందిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండల పరిధిలోని చేర్యాల గేటు వద్ద ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన తుఫాన్ వాహనం ఢీ కొట్టింది.
దీంతో వాహనంలో ఉన్న నారాయణఖేడ్ చాంద్‌ఖాన్‌పల్లికి కు చెందిన బాలయ్య (52) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఈ ప్రమాదంలో తూప్రాన్ మండలం అల్లాపూర్ కు చెందిన ప్రవీణ్, న్యాల్కల్ మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన ఫరీద్, సిర్గాపూర్ గ్రామానికి చెందిన సీతారాం, రాయచూరు కు చెందిన కాలప్ప తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. -- తుఫాన్ వాహనంలో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.-- ప్రమాదంలో తుఫాన్ వాహనం నుజ్జునుజ్జైంది.
Follow Us