/rtv/media/media_files/2025/05/01/04ADQ5xk2O9hWpTEcmFK.jpg)
cast survey Photograph: (cast survey)
Cast Survey: కులగణన అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించగా.. రాష్ట్రాల కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వే ప్రశ్నార్థకంగా మారింది.
🚨 🚨 #BreakingNews As Union government decides to enumerate caste, Ashwini Vaishnaw insists SECC, State efforts were ‘surveys’ https://t.co/QyHCx3vSwQ
— Instant News ™ (@InstaBharat) April 30, 2025
Karnataka, Bihar and Telangana, the States that have so far tried to undertake caste enumeration, have not made the entire …
మినహాయిస్తారా? రద్దు చేస్తారా?
ఈ మేరకు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టబోతున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు కులగణన చేపట్టగా వీటిని మినహాయిస్తారా? లేక మొత్తం రద్దు చేసి కొత్తగా నిర్వహిస్తారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోగా పలు రాష్ట్రాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన నిర్వహించాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్.. కేంద్ర మంత్రివర్గం తదుపరి జనాభా లెక్కల్లో కులాన్ని లెక్కించాలని నిర్ణయించిందని చెప్పారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన కులగణన కేవలం సర్వేలు మాత్రమే అన్నారు.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
కేంద్ర, రాష్ట్ర లేక్కల్లో తేడాలు..
'జనగణన కేంద్ర పాలిత అంశం.. కానీ కొన్ని రాష్ట్రాలు కులగణన చేశాయి. అందులో కొన్ని పారదర్శకంగా చేస్తే మరికొన్ని రాష్ట్రాలు దీనిని పూర్తిగా రాజకీయ కోణంలోనే నిర్వహించాయి. కులాన్ని లెక్కించడానికి బీహార్, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ప్రయత్నించాయి. దేశవ్యాప్తంగా కేంద్రం 2,650 OBC కమ్యూనిటీల లిస్ట్ తయారు చేయగా, రాష్ట్రాల్లో మాత్రం 3,651 కంటే ఎక్కువ కమ్యూనిటీలు వర్గీకరించబడ్డాయి. కాబట్టి మరోసారి ఈ అంశాలను పరిశీలించాల్సివుంది' అన్నారు. దీంతో తెలంగాణతోపాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన కులగణన రద్దు చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రద్దు?
ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రిజర్వేషన్ అమలుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జనాభాగణన 7వ షెడ్యూల్ కేంద్ర జాబితాలోని అంశం. 1948 జనాభాగణన చట్టం ప్రకారం సర్వే చేప్టటే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంది. జనాభాగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. రాష్ట్రాలు చేపట్టినా దానికి చట్టబద్ధత ఉండదు. 2008 చట్టం ప్రకారం 7వ జాబితాలోని జనాభాగణనను రాష్ట్రాలు నిర్వహించకూడదు. అది రాష్ట్రాల పరిధిలోకి రాదు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు నిర్వహించిన ‘ఇంటింటి సర్వే’ కూడా రద్దు కానున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
ప్రామాణికమైన డేటా..
ఈ సర్వేకోసం ప్రామాణికమైన డేటా.. ఓటర్, ఆధార్, రేషన్‌కార్డు తదితర జాబితాలను పరిశీలిస్తారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులపై అధ్యయనం చేస్తారు. వీటన్నింటి ఆధారంగా నివేదిక రూపొందిస్తారు. ఆ నివేదికకు క్యాబినెట్ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత కేంద్రం ఆమోదం పొందితేనే ఆ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో 2024 నవంబర్‌లో ఇంటింటి సర్వే చేపట్టింది. కానీ ఈ గణాంకాలపై విమర్శలు రావడంతో రీ సర్వే చేపట్టింది. ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకోనుందనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!
cast survey | india | telugu-news | today telugu news