/rtv/media/media_files/2025/09/15/jubilee-hills-by-election-2025-09-15-12-13-55.jpg)
Jubilee Hills by-election
Jubilee Hills Election: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ సిట్టింగ్ నియోజకవర్గాన్ని ఎలాగైన తిరిగి దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది. అయితే ఈ సీటుపై కాంగ్రెస్ కూడా కన్నేసింది. అయితే ఇదిలా ఉండగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోకస్ పెట్టడం చర్చనీయంశంగా మారింది. ఆమె కూడా తన సంస్థ నుంచి అభ్యర్థిని నిలపడానికి ప్రయత్నిస్తు్న్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కీలక నేతలతో ఈ రోజు కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:Nepal: నేపాల్ తాత్కాలిక ప్రభత్వ సారథిగా సుశీలా కర్కి ప్రమాణం
ఇదిలా ఉండగా కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ తనయుడు పి. విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ(సోమవారం) ప్రత్యేకంగా కవితతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి సతీమణి సునీతకు టికెట్ ఇస్తుందన్న ప్రచారం నేపథ్యంలో వీరి భేటీ కీలకంగా మారింది. గతంలో కాంగ్రెస్ నుంచి టీకెట్ ఆశించిన విష్ఫువర్ధన్ రెడ్దికి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన బీఆర్‌ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో మాగంటి గెలుపునకు కృషి చేశాడు, అయితే ఇటీవల మాగంటి మరణంతో ఆయన సతీమణి ఎన్నికల్లో పోటీ చేయకపోతే విష్ణుకే టికెట్ అన్న ప్రచారం సాగింది. అయితే ఇపుడు సునీత బరిలో ఉంటున్న నేపథ్యంలో ఆయన కవితతో బేటీ కావడం సంచలనంగా మారింది. ఇటీవలె జరిగిన జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొన్న ఆయన ఒకసారిగా ఆయన కవిత వైపు తిరగడం కలకలం రేపింది. కవితతో అరగంటకు పైగా మంతనాలు సాగించిన విష్ణు ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డిని పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దానికోసం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే.. ఆ ప్రభావం మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తు్న్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలో గెలిచి.. జూబ్లీహిల్స్‌లో తమ ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదని సాంకేతాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయన నియోజక వర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో ఆయన భేటీ అవుతున్నారు.
Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?