Nepal: నేపాల్ తాత్కాలిక ప్రభత్వ సారథిగా సుశీలా కర్కి ప్రమాణం

మొత్తానికి నేపాల్ రాజకీయ సంక్షోభానికి తెర పడింది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణం చేశారు. కొద్దిసేపటి క్రితం అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ ఆమెతో ప్రమాణం చేయించారు.

New Update
susila

Susila Karki

నేపాల్ రాష్ట్రపతి హవన్ లో శుక్రవారం రాత్రి 9.30 గంటకు తాత్కాలిక ప్రభుత్వ సారథిగా సుశీలాకర్కి ప్రమాణ స్వీకారం చేశారు. చాలా కొద్ది మంది మంత్రులతో ఈమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తరువాత వెంటనే కేబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తారని తెలుస్తోంది. చాలా చర్చల అనంతరం సుశీలాకర్కి ని తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమించాలని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్దెల్‌, దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ నిర్ణయించారు. జెన్ జీ ఉద్యమకారులతో కూడా వీరు పలు దఫాల్లో చర్చలు చేశారు. అందరి అంగీకారంతోనే చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఎవరీ కర్కి..

సుశీలాకర్కి నేపాల్‌ సుప్రీంకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈమె ప్రస్తుత వయసు 72 ఏళ్ళు. జూన్‌ 7, 1952లో విరాట్‌నగర్‌లో జన్మించారు. మొదట ఉపాధ్యాయురాలిగా పని చేసిన సుశీలా...తర్వాత న్యామవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. తన పదవీకాలంలో ఆమె అనేక అవినీతి కేసులలో కఠినమైన తీర్పులు ఇచ్చి, న్యాయవ్యవస్థలో ఆమె నిజాయితీ, ధైర్యాన్ని చాటుకున్నారు. ఆమె నిర్ణయాలపై మాజీ ప్రధాని ఓలీ తీవ్రంగా స్పందించి, ఆమెపై అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, ప్రజల మద్దతు, న్యాయస్థానం జోక్యంతో ఆ తీర్మానం వీగిపోయింది. ఆమె నిజాయితీ, నిష్పక్షపాత వైఖరి కారణంగానే 'జెన్-జెడ్' ఆమెను ఎంపిక చేసింది.

Advertisment
తాజా కథనాలు