Mirai Day BOX Office Collections: సూపర్ హీరో తేజ సజ్జ - కార్తీక్ ఘట్టమనేని కాంబోలో ఈనెల 12న థియేటర్స్ లో విడుదలైన 'మిరాయ్' బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. సూపర్ హిట్ రెస్పాన్స్ తో కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 55.60 కోట్ల వసూళ్లు సాధించింది. మొదటి రోజు కంటే రెండవ వసూళ్ళలో గమనీయమైన పెరుగుదలను కనబరిచింది. ఇది సినిమా విజయాన్ని, సినిమాపై ప్రేక్షకులు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. మొదటి రోజు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండవ రోజు రూ. 28 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
ఇండియాలో..
సక్నిల్క్ నివేదిక ప్రకారం.. కేవలం ఇండియాలో మొదటి రోజు రూ. 13 కోట్లు (నెట్) వసూలు చేసింది. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి అత్యధిక వసూళ్లు రాబట్టింది. తెలుగులో రూ. 11 కోట్ల వసూలు చేయగా.. హిందీ వెర్షన్ రూ. 1.65 కోట్లు వసూలు చేసింది. అలాగే రెండవ రోజు దేశవ్యాప్తంగా రూ. 14.5 కోట్లు రాబట్టింది. ఇది మొదటి రోజు వసూలు చేసిన 11.5% ఎక్కువ. రెండవ రోజు తెలుగు వెర్షన్ వసూళ్ళలో స్థిరత్వం కనిపించగా.. హిందీ కలెక్షన్స్ లో పెరుగుదల కనిపించింది. మొదటి రోజు హిందీ వెర్షన్ నుంచి రూ. 1.65 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు రూ. 2.8 కోట్లతో మొత్తం రూ. 4.45 కోట్లకు చేరుకుంది. ఇక మిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించడంలేదు! చాలా తక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఆదివారం వసూళ్లతో ఈ వారాంతంలోనే మిరాయ్ అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్-ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
#SuperYodha is breaking boundaries and blazing at the box office 🔥🔥🔥
— Ritika Nayak (@RitikaNayak_) September 14, 2025
₹𝟱𝟱.𝟲 𝗖𝗥 Worldwide GROSS in 2 DAYS for #Mirai ❤️🔥❤️🔥❤️🔥
Experience #BrahmandBlockbusterMirai ONLY IN CINEMAS 💥💥💥
— https://t.co/ZcmluhlRrn
Superhero @tejasajja123
Rocking Star @HeroManoj1… pic.twitter.com/EyAOdqce7Z
పురాతన కథ నేపథ్యంతో..
అశోకుడి కాలం నాటి తొమ్మిది అతీత శక్తులు కలిగిన గ్రంథాల కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. అడ్వెంచర్, యాక్షన్, డివోషన్, ఎలివేషన్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. , ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన విజువల్స్, గౌరీ హరి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయి. కథలో కంటెంట్ తో పాటు టెక్నీకల్ అంశాలు కూడా మెప్పించాయి. ఇందులో అతీత శక్తులు కలిగిన గ్రంథాల కాపాడే యోధుడిగా తేజ సజ్జ నటించగా.. వాటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించే దుష్ట శక్తిగా మంచు మనోజ్ నటించారు.
Also Read: Manchu Lakshmi: నానికి కరెక్ట్ విలన్ డాడీనే.. 'ప్యారడైజ్' మూవీ అప్‌డేట్ లీక్ చేసిన మంచు లక్ష్మి