Mirai Vibe Song: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?

తేజ సజ్జా ‘మిరాయ్’ సినిమా సెప్టెంబర్ 12న విడుదల అయ్యింది. ఇందులో తేజ సూపర్ యోధుడిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. "వైబ్ ఉందిలే" పాట యూట్యూబ్ లో రిలీజ్ కాగా, చివరి నిమిషంలో సినిమా నుంచి తీసేయడంతో ఫ్యాన్స్‌ నిరాశ చెందారు.

New Update
Mirai Vibe Song

Mirai Vibe Song

Mirai Vibe Song: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా, తాజాగా మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘మిరాయ్’ (Mirai Movie) సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయ్యింది.

ఈ సినిమాపై రిలీజ్‌కి ముందు నుంచే భారీగా హైప్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్‌లతో పాటు ప్రమోషన్స్ తో మేకర్స్ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. చాలా స్పెషల్ ఎలిమెంట్స్‌, సుర్ప్రైజెస్ తో ఈ సినిమా థియేటర్ లలో నెక్స్ట్ లెవెల్‌ లో ఉండనుంది.

Also Read: నా తమ్ముడికి బెస్ట్ విషెస్.. 'మిరాయ్' మూవీపై మంచు విష్ణు ట్వీట్ వైరల్..!

సూపర్ యోధుడిగా తేజ సజ్జా(Teja Sajja).. 

ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధుడిగా నటించాడు. ఇప్పటి వరకు చూసిన తేజ క్యారెక్టర్స్‌కి పూర్తిగా భిన్నంగా, ఈసారి మాస్ యాక్షన్ హీరోగా తెరపై కనిపించనున్నాడు. యాక్షన్ సన్నివేశాలు, విభిన్న కథనం, స్టైలిష్ విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించారు. విజువల్ ప్రెజెంటేషన్, సినిమాటోగ్రఫీ, బీజీఎం అన్నీ హై క్వాలిటీగా ఉన్నాయని సినిమా చుసిన వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఉన్న కథ, ఫాంటసీ టచ్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం అని టాక్ వస్తోంది.

Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో

వైబ్ మిస్సింగ్.. 

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ముందుగా రిలీజ్ చేసిన "వైబ్ ఉందిలే" పాట యూత్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్యాచీ బీట్స్, డ్యాన్స్ మూమెంట్స్‌తో పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యింది. అయితే అదే తరహాలో, నిధి అగర్వాల్ చేసిన స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లో చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారు.

Also Read:లారెన్స్ "కాంచన 4"పై క్రేజీ అప్‌డేట్.. ఈసారి బొమ్మ దద్దరిల్లాల్సిందే!

కానీ ఆశించినదానికి భిన్నంగా, ఈ స్పెషల్ సాంగ్‌ను ఫైనల్‌గా సినిమా నుండి తొలగించారు. కారణం ఏంటంటే సినిమా కథనాన్ని డిస్ట్రబ్ చేయ్యోద్దనే భావనతో చివరి నిమిషంలో పాటను కట్ చేశారట. మేకర్స్ ఈ విషయాన్ని ముందుగా ప్రకటించకపోయినా, థియేటర్లలో పాట లేకపోవడం చూసిన అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు.

Also Read:కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?

నిధి అగర్వాల్ గ్లామర్, డాన్స్‌కు ఉన్న ఫాలోయింగ్ ని బట్టి, ఈ పాటపై క్రేజ్ ఏ లెవెల్లో ఉంటుందో చెప్పక్కర్లేదు. అయితే మేకర్స్ ప్లాన్ ప్రకారం, త్వరలోనే ఆ పాటను యూట్యూబ్‌లో విడదల చేయాలని చూస్తున్నారట. అలాగే "వైబ్ ఉందిలే" పాటను కూడా పూర్తి వీడియోగా త్వరలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మిరాయ్ సినిమా తేజ సజ్జా కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలిచేలా కనిపిస్తోంది. యాక్షన్, విజువల్స్, కథ అన్నింటికీ కొత్తదనం ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. పాటల విషయంలో కొంత నిరాశ వచ్చినా, సినిమా మొత్తం మీద ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది. 

Advertisment
తాజా కథనాలు