/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
Maoists Surrender to Police
Maoists: భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల నుంచి పురుడు పోసుకున్న పీపుల్స్‌వార్..నేటి మావోయిస్టు ఉద్యమం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వేలాదిమంది సాయుధ బలగాలతో రెడ్‌మార్చ్ నిర్వహించిన దండకారణ్యంలో నేడు రక్షణ కరువై అనేకమంది ఎన్‌కౌంటర్ల(maoist encounter incident)లో ప్రాణాలు పోగొట్టుకొంటే. మరికొందరు ఉద్యమ బాట వీడుతున్నారు. అగ్రనేతలే ఆయుధాలు వీడుతుండటంతో ఉద్యమ ఇక అంతిమ దశకు చేరుకుందనే ప్రచారం సాగుతోంది. నాలుగున్నర దశాబ్ధాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న మావోయిస్టు ఉద్యమం గడచిన ఏడాది కాలంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయింది. పార్టీ కేంద్ర కమిటీ నాయకులతో పాటు వందలాది మందిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్న మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమంలో కొనసాగే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే పలువురు నేతలు ఈ దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అబూజ్‌మడ్ గుండెకోట్‌లో మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అనంతరం శ్రేణుల్లో పూర్తి స్థాయి నిరాశ నెలకొంది.
Also Read : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం!
Some Other Key Figures Are Planning To Lay Down Arms
ఇదిలా ఉండగానే ఈ ఏడాది మావోయిస్టు పార్టీ పూడ్చుకోలేని నష్టాన్ని చవిచూసింది. ఈ ఏడాది కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా వంటి అగ్రనేతలంతా మృతి చెందారు. మరోవైపు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు ఆయుధాలతో తమ సహచరులతో పాటు లొంగిపోవడం; చంద్రన్న, బండి ప్రకాశ్ వంటి నేతలు అనారోగ్య కారణాలతో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవడంతో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు ముఖ్యనేతలు, నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ తెలంగాణ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్దమవుతున్నారన్న ప్రచారం సాగుతోంది. పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఇప్పటికే పోలీసుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరందర్నీ మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికోసం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) ఇప్పటికే లొంగుబాటు కోసం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
అదే సమయంలో కేంద్ర కమిటీలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురు అగ్రనేతల కోసం ఎస్‌ఐబీ ఎంక్వయిరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్-ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ(బీజేఎస్‌ఏసీ)కి ఇన్‌ఛార్జిగా ఉన్న హనుమకొండకు చెందిన పసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, సౌత్ రీజినల్ బ్యూరోకు నాయకత్వం వహిస్తున్న నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలకు చెందిన పాక హన్మంతు ఎలియాస్ ఊకే గణేష్‌లతో పాటు నరహరి ఝార్ఖండ్ గిరిడీహ్ ప్రాంతంలో.. హన్మంతు ఒడిశా కంధమాల్ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని లొంగుటాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ లొంగుబాటను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
Also Read : పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్
ఇక ఇదంతా ఇలా ఉంటే పార్టీ అగ్రనేత, మావోయిస్టు సుప్రీం కమాండర్ గణపతి ఆచూకీపై మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడనే సమాచారం పార్టీలో చాలామందికి కూడా తెలియదు అంటున్నారు. అయన గతంలోనే విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం సాగినా..అలాంటి అవకాశం లేదని పోలీసులు అంటున్నారు. ఇటీవల వరకు ఆయన అబూజ్‌మడ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ ఆరంభానికి కొద్దిరోజుల ముందే ఆయనను మరో సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. అయితే ఆయన ఎక్కడున్నారనేది మాత్రం తెలియడం లేదు. కాగా రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టుల లొంగుబాటు ఉంటుందన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
Follow Us