/rtv/media/media_files/2025/11/21/fotojet-2025-11-21t104411812-2025-11-21-10-45-20.jpg)
Road Accident
Road Accident In Rangareddy District
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం(road-accidnet) జరిగింది. బీజాపూర్ హైవేపై(accident on hyderabad bijapur road) మొయినాబాద్(Moinabad) మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : మావోయిస్టులకు బిగ్ షాక్.. ఆయుధాలు వీడే యోచనలో మరికొందరు ముఖ్యులు!
Also Read : నాగార్జున, వెంకటేష్‌లకు షాక్.. స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు
Follow Us