Maoist: ఛత్తీస్గడ్లో 22 మంది మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్
సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు శుక్రవారం భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో తొమ్మిది మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.50వేల సాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.