South Africa: పెంగ్విన్ కారణంగా కూలిపోయిన హెలికాఫ్టర్

దక్షిణాఫ్రికాలో ఓ హెలికాఫ్టర్ కూలిపోయింది.  దీనంతటికీ కారణం ఓ పెంగ్విన్. ప్రమాదం జనవరిలో జరిగినా వివరాలు మాత్రం తాజాగా బయటకు వచ్చాయి. రిస్క్ అంచనా వేయకుండా పెంగ్విన్ ను తీసుకెళ్ళడమే పైలెట్ చేసిన తప్పని తేలింది. 

New Update
helicopter

Helicopter Accident In SA

దక్షిణాఫ్రికాలోని ఈస్టర్న్ కేప్ ప్రాంతంలో బర్డ్స్ ద్వీపం నుంచి రాబిన్సన్ ఆర్44 రావెన్ 2 హెలికాఫ్టర్ బయలుదేరింది. కానీ 50 అడుగుల ఎత్తుకు లేవగానే అదుపు తప్పి నేలపై కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు అందులో ఉన్నవారు మాత్రం అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం తర్వాత దక్షిణాఫ్రికా సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ దీనిపై దర్యాప్తు చేపట్టింది. 

కార్డ్ బాక్స్ లో పెంగ్విన్..

రాబిన్సన్‌ ఆర్‌44 రావెన్‌ 2 చిన్న హెలికాఫ్టర్. కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఉంటాయి. పైలెట్ కాకుండా ముగ్గురు ప్రయాణికులు ఇందులో బయలుదేరారు. అందులో ఒక నిపుణుడు పెంగ్విన్ ను పోర్ట్ ఎలిజిబెత్ కు తరలించాలని కోరారు. అందుకు పైలెట్ కూడా ఒప్పుకున్నాడు. కానీ రిస్క్ ను అంచనా మాత్రం వేయలేకపోయాడు. అసలేం జరిగిందంటే...పెంగ్విన్ ను ఓ కార్డ్ బాక్స్ లో ఉంచి పైలెట్ పక్కనే ఉన్న వ్యక్తి ఒడిలో ఉంచారు. హెలికాఫ్టర్ 50 అడుగుల ఎత్తు ఎగరగానే.. ఆ బాక్స్‌ ఒక్కసారిగా పైలట్‌ సైక్లిక్‌ పిచ్‌ కంట్రోల్‌ లివర్‌పై పడింది. దీంతో హెలికాప్టర్‌ అదుపుతప్పి.. దాని రెక్కలు నేలను తాకడంతో అది కూలిపోయింది. పెంగ్విన్ ను తరలించాలనుకోవడం వరకు ఒకే కానీ దానిని సురక్షితమైన స్థానంలో ఉంచకుండా ఒళ్ళో పెట్టుకోవడం వల్లనే ప్రమాదం జరిగిందని దక్షిణాఫ్రికా సీఏఏ అంటోంది. పైలట్‌ కూడా దానిని కార్డుబోర్డు బాక్స్‌లో తరలించి.. ముప్పును అంచనావేయడాన్ని విస్మరించాడని సీఏఏ తన నివేదికలో తెలిపింది. 

today-latest-news-in-telugu | south-africa | helicopter

Also Read: CSK VS KKR: కేఆర్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్

Advertisment
తాజా కథనాలు