BRS Leaders: బీఆర్ఎస్ వరంగల్ సభ.. తలనొప్పిగా మారిన ఇద్దరు నేతల ఫైట్!

వరంగల్ బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. రజతోత్సవ సభకు జనాన్ని తరలించే సన్నాహాక ప్రక్రియలో భాగంగా నేతల మధ్య ఐక్యత లోపించడంతో వివాదం రాజుకుంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మధ్య విభేదాలు పొడ చూపాయి.

New Update
BRS Leaders FIGHT

BRS Leaders FIGHT

BRS Leaders : పదేండ్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఒక్కసారిగా ఒటమిపాలవ్వడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఒక వైపు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, ఒక ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ క్రమంలో పార్టీ రజతోత్సవ సభతో తమ సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనికోసం వరంగల్ కేంద్రంగా భారీ సభ నిర్వహించడానికి సమాయత్తమవుతోంది. అయితే నాయకుల మధ్య సమన్వయం లోపించడంతో వరంగల్ బీఆర్ఎస్ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.

Also Read: ట్రంప్‌ను తిడుతూ.. వలసదారులకు స్వాగతం అంటున్న అమెరికన్ పౌరులు

 బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాన్ని తరలించే సన్నాహాక ప్రక్రియలో భాగంగా నేతల మధ్య ఐక్యత లోపించడంతో వివాదం రాజుకుంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మధ్య విబేధాలు పొడ చూపా యి. రజతోత్సవ సభ జిల్లా సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌పై సొంత పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని ఎమ్మెల్సీ రవీందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే యమునా తీరుగా వ్యవ హరిం చడం సరైంది కాదని అన్నారు. సమన్వయ కర్తగా సత్యవతి రాథోడ్ పార్టీ శ్రేణులను అందరిని కలుపుకొని పోవాలని ఈ సందర్భంగా సూచించారు. నేతల్లో సఖ్యత కుదరడం లేదని.. కనీసం తనకు ఫోన్ కూడా చేయలేదని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆరోపించారు. అందరినీ ఒకే తాటిపై నడిపించే సమర్థ నాయకత్వం కొరవడిందని ఆరోపణలు చేశారు.

Also Read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

కలిసి పనిచేయమని కేసీఆర్ ఆదేశిస్తే సత్యవతి రాథోడ్ నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేదని, సత్యవతి రాథోడ్ ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఈ జిల్లా వైఫల్యానికి నేతల మధ్య ఐక్యత లేకపోవడమేనన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకునే పార్టీ నాయకత్వ లేమి ఇక్కడ ఉందన్నారు. అధిష్టానం ఆదేశాలు అందరూ పాటించాలని, ఎంతో నమ్మకంతో అధిష్టానం ఆమెకు ఈ బాధ్యత అప్పగించిందన్నారు. ఈ రకంగా వ్యవహరిస్తే పార్టీ నష్టపోతుందన్నారు.

Also Read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

రజతోత్సవ సభ వేళ ఏర్పడ్డ విబేధాలు పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. సభా స్థలి ఎంపిక నాటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య సమన్వయలోపం కనిపిస్తోందని కేసీఆర్ గ్రహించారని దీంతో నేతల తీరుపై ఇప్పటికే ఓ సారి క్లాస్ తీసుకున్నట్లు టాక్ వినిపించింది. తీరు మార్చుకోవాలని అందరూ కలిసి సమిష్టిగా పని చేయాలని సూచించారని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ ఉపదేశంతో అంతా సద్దుమణుగుతుందనుకునే లోపు సత్యవతిరాథోడ్ తీరుపై ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బహిరంగంగా చేసిన విమర్శలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ వైపు సభా తేదీ దగ్గరపడుతున్న వేళ వరంగల్ జిల్లా నేతల మధ్య మాత్రం విభేదాలు తారాస్థాయికి చేరడం కారు పార్టీలో కంగారుగా మారుతోంది.

Also Read:  Ayodhya: అయోధ్యలో రామయ్య దర్శనానికి 80 మీటర్ల సొరంగం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు