Sheep Scam: తెలంగాణలో వేయికోట్ల కుంభకోణం?

గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగానే అవినీతి జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ స్కామ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఈడీ ఆరోపించింది.

New Update
Sheep scam case)

Sheep scam

గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకు పైగానే అవినీతి జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన   గొర్రెల పంపిణీ స్కామ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఈడీ ఆరోపించింది. గొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం అమలులో భాగంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. దాని ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ పథకం అక్రమాల విలువ రూ.వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Also Read:  తెలంగాణ మహిళలకు బంపరాఫర్.. ఉచిత బస్సు ట్రైనింగ్

Sheep Scam In Telangana

గత ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వద్ద ఓఎస్డీగా పనిచేసిన జి. కల్యాణ్‌ కుమార్‌, ఇతర లబ్ధిదారులు, మధ్యవర్తుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక ఆధారాలు సేకరించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు ముడుపుల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కళ్యాణ్ ఇంట్లో 200 కుపైగా బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన  చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, డెబిట్‌ కార్డులు, 31 సెల్‌ఫోన్లు, 20 సిమ్‌కార్డులను గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. గొర్రెల స్కాం కోసం ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లోనూ ఉపయోగించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది.

కాగా గొర్రెల పంపిణీలో కుంభకోణం జరిగినట్లు గతంలోనే కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక కాలానికి సంబంధించి కాగ్‌ నిర్వహించిన ఆడిట్‌లో ఈపథకం అమలులో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. కాగా తెలంగాణలోని 7 జిల్లాల్లోనే రూ.253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లు గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో తెలిపింది. అయితే, 33 జిల్లాల్లో కూఫీ లాగితే రూ. 1000కోట్లకుపైనే అక్రమాలు జరిగినట్లు తెలిసిందని ఈడీ వెల్లడించింది. అంతేకాక ఈ కేసులో లబ్ధిదారుల వివరాలను పొందుపచకపోవడం, రవాణా ఇన్వాయిస్‌ రికార్డులు అసంపూర్ణంగా ఉండటం, నకిలీ వాహన నంబర్లతో కూడిన ఇన్వాయిస్‌కు చెల్లింపులు చేయడం వంటి అనేక అవకతవకలను అధికారులు గుర్తించారు. ఇంకా దారుణం ఏంటంటే చనిపోయిన/ఉనికిలో లేని వ్యక్తుల పేరుతో కూడా గొర్రెల యూనిట్లను కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ స్పష్టం చేసింది.

Also Read : రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక

 గత ప్రభుత్వం 2017లో ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రెండు విడతల్లో సుమారు రూ.4.25 లక్షల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారికి లెక్కలు చెబుతున్నాయి. దీనికోసం దాదాపు రూ.4 వేల కోట్లు మంజూరు చేసినట్లు తేలింది. అయితే పంపిణీ చేసింది కొన్ని యూనిట్లు మాత్రమే కాగా, కొన్నవి మాత్రం ఎక్కువ మొత్తంలో చూపించడంతో అక్రమాలు వెలుగు చూశాయి.కొన్ని యూనిట్లనే పంపిణీ చేసి.. ఎక్కువ కొన్నట్లు చూపడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఈ కుంభకోణంలో గతంలోనే ఏసీబీ అధికారులు 17 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం తలసాని మాజీ ఓఎస్డీ ని అరెస్ట్ చేయడంతో ఈ కేసు ఇంకా ఎంతమందికి చట్టుకుంటుందన్న విషయం చర్చనీయంశంగా మారింది.

Talasani Srinivas Yadav | sheep-sale-and-purchase | telangana-sheep-distribution-scheme | Sheep Distribution Scam | latest-telugu-news | telugu-news | latest telangana news | telangana crime news | telangana-crime-updates

Advertisment
తాజా కథనాలు