/rtv/media/media_files/2025/04/30/gTUP3WxvGUBe61cVpiLX.jpg)
TG TET 2025
TG TET 2025: తెలంగాణ టెట్ 2025 (జూన్ సెషన్) దరఖాస్తు గడువు నేటి (ఏప్రిల్ 30)తో ముగుస్తుంది. జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభమై జూన్ 30 వరకు జరుగుతాయి. ఫలితాలు జూలై 22న విడుదలవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఇప్పటికే గ్రూప్స్, డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేసింది. మరోసారి పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డీఎస్సీకి అర్హత సాధించాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి. ఇప్పటికే వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అప్లై చేసుకోని వారికి ఈ రోజే చివరి అవకాశం. తెలంగాణలో నేటితో అంటే ఏప్రిల్ 30తో టెట్ దరఖాస్తు గడువు ముగియనున్నది. ఈ ఏడాది టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 మధ్య నిర్వహించనున్నారు.
Also Read: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం
జూన్ 15 నుంచి ఎగ్జామ్స్ !
తెలంగాణ టెట్ 2025 మొదటి ఎగ్జామ్ షెడ్యూల్ వివరాల ప్రకారం, ఏప్రిల్ 30వ తేదీతో అప్లికేషన్లు ముగుస్తాయి. ఈలోపే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ. 750 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 9 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జూన్ 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. ప్రాథమిక కీలను ప్రకటించిన తర్వాత జూలై 22న టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.
Also Read: పాకిస్థాన్‌కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !
1,34,011 దరఖాస్తులు
కాగా ఇప్పటి వరకు పేపర్ I కు 38,068 దరఖాస్తులు,పేపర్ II కు 82,433 దరఖాస్తులు వచ్చాయి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకున్న వారు 13,510, మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు మొత్తం 1,34,011. ఈసారి టెట్ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ మోడ్ లో నిర్వహించనున్నారు. అంటే అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 7032901383, 9000756178 నెంబర్లను సంప్రదించవచ్చు. అంతేకాకుండా తెలంగాణ టెట్ ఆఫీస్ ను సంప్రదించేందుకు 7093708883, 7093708884 నెంబర్లకు కాల్ చేయవచ్చు.
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!