TET : టెట్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్.. ఉద్యమ బాటలో నిరుద్యోగులు!
తెలంగాణ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. టెట్ ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు భారీగా పెంచేసింది. గతంలో నాలుగు వందలుండగా ఇప్పుడు వెయి రూపాయలు చేసింది. దీంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.