Lagacharla: లగచర్ల నిర్వాసితులకు భట్టి గుడ్ న్యూస్..!

ఫార్మా కంపెనీల కోసం భూమి కోల్పోతున్న లగచర్ల ప్రజలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. భూ నిర్వాసితులకు భారీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలతో రైతులు ఆందోళన చెందకూడదన్నారు.

author-image
By srinivas
New Update
vikram

Bhatti Vikramarka : ఫార్మా కంపెనీల కోసం భూమి కోల్పోతున్న లగచర్ల ప్రజలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. భూ నిర్వాసితులకు భారీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలతో రైతులు ఆందోళన చెందకూడదన్నారు. ఇక రాష్ట్రంలో పరిశ్రమలు రావడం బీఆర్ఎస్ కు ఇష్టంలేదని, అందుకే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. దాడులతో రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారని మండిపడ్డారు. మీ కోసం అమాయక ప్రజలను బలి చేయాలనుకుంటున్నారా? దాడి వెనక ఎంతటి వారున్న వదిలే ప్రసక్తే లేదు. ప్రజలను రెచ్చగొట్టి దాడులకు పాల్పడ్డవారిని వదిలిపెట్టమంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 

Also Read :  ఫస్టాఫ్ అద్భుతం,సెకండాఫ్ అంతకు మించి.. రష్మిక పోస్ట్ వైరల్

భూ సేకరణ జరగాల్సిందే..

ఇక కొడంగల్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివద్ధి సాధిస్తే తప్ప ప్రపంచంతో పోటీ పడలేమన్నారు. పరిశ్రమలు రావాలంటే భూ సేకరణ జరగాల్సిందేనని, పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి:  Terrorists: హైదరాబాద్, వైజాగ్‌లో ఉగ్రవాదులు.. దాడులు చేసేందుకు భారీ ప్లాన్

మంచి ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు..

‘‘భూమి కోల్పోతున్న రైతుల బాధ మాకు తెలుసు. రైతుల బాధను ఇందిరమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుంది. భూమి కోల్పోతున్న వారికి మంచి ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తాం. ఇళ్లు కోల్పోతున్న వారికి మంచి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తున్నాం. కావాలనే కుట్రపూరితంగా కలెక్టర్‌పై బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశారు. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారు. కలెక్టర్‌, అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి సమస్యకు పరిష్కారం కాదు.. కలెక్టర్‌తో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. 

ఇది కూడా చదవండి:  Rajasthan: పోలింగ్ అధికారి చెంప చెల్లుమనిపించిన అభ్యర్థి

Also Read : Revanth Reddy: కొడంగల్‌లో అసలేం జరుగుతోంది.. ఫార్మాసిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు