Terrorists: హైదరాబాద్, వైజాగ్‌లో ఉగ్రవాదులు.. దాడులు చేసేందుకు భారీ ప్లాన్

తెలుగు రాష్ట్రాలకు ఉగ్రముప్పు పొంచిఉండటం కలకలం రేపుతోంది. హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ.. హైదరాబాద్‌, వైజాగ్‌లో మకాం వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ భద్రతా సంస్థలను అలెర్ట్ చేసింది.

New Update

తెలుగు రాష్ట్రాలకు ఉగ్రముప్పు పొంచిఉండటం కలకలం రేపుతోంది. హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ.. హైదరాబాద్‌, వైజాగ్‌లో మకాం వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడులను ముందుగానే పసిగట్టిన ఎన్‌ఐఏ అప్రమత్తమైంది. భద్రతా సంస్థలకు అలెర్ట్ చేసింది. ఈ సంస్థతో అనుబంధమున్న పలువురు అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేసింది. ISIS తర్వాత భారత్‌కు హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్‌ అతిపెద్ద ముప్పుగా మారుతోందని ఎన్‌ఐఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Also  Read: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

Terrorists

ఇటీవల రెండురోజుల పాటు జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో ఈ సంస్థ దేశానికి అతిపెద్ద ప్రమాదకరంగా మారుతోందని ఎన్‌ఐఏ భావించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. మధ్యప్రదేశ్‌లో కూడా హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్ సంస్థకు స్లీపర్ సెల్స్‌ ఉన్నట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ సంస్థ బంగ్లాదేశ్‌లో కూడా చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి దీనిపై నిషేధం వేటు వేసింది. 

Also Read :  రీమేక్ వద్దని చెప్తే వినలేదు.. వాటి మీదైనా దృష్టి పెట్టుంటే హిట్ అయ్యేదేమో

అయితే ఈ హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్ ఉగ్ర సంస్థ అనేక ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొంటోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అమాయక యువతను ఉగ్ర సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరించడం వంటి పనులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ సంస్థ దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పు అని తెలిపింది. 

Also read: వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే

జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చేసి.. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలను స్థాపించడమే హిజ్బ్‌-ఉత్-తాహిర్ ఉగ్రసంస్థ లక్ష్యమని కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. భారతీయ పౌరులను మతం పేరుతో ఆకర్షించి వారి మైండ్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మార్చుతోందని తెలిపింది. మరోవైపు ఈ ఉగ్రసంస్థ సామాజిక మాధ్యమాల కూడా విస్తృతంగా ఉపయోగించుకుంటోందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

Also Read :  వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే

Advertisment
Advertisment
తాజా కథనాలు