Rashmika: ఫస్టాఫ్ అద్భుతం,సెకండాఫ్ అంతకు మించి.. రష్మిక పోస్ట్ వైరల్ హీరోయిన్ రష్మిక 'పుష్ప 2' డబ్బింగ్ తో బిజీగా ఉంది. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫొటోని తన ఇన్ స్టాలో షేర్ చేసి సినిమాపై ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ అంతకు మించి ఉంటుంది. మాటల్లో చెప్పలేకపోతున్నానని పేర్కొంది. By Anil Kumar 13 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప ది రూల్' రిలీజ్ టైం దగ్గర పడుతోంది. ఈ సినిమా విడుదలకు కేవలం 20 రోజులే ఉంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేసింది. తాజగా ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. హీరోయిన్ రష్మిక 'పుష్ప 2' డబ్బింగ్ తో బిజీగా ఉంది. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియోలో దిగిన ఫొటోని తన సోషల మీడియాలో షేర్ చేసి సినిమాపై ఆసక్తికర పోస్ట్ పెట్టింది.' ఫన్, గేమ్స్ ఇక పూర్తయ్యాయి. పనిలో బిజీ అయ్యా..! 'పుష్ప ది రూల్' చిత్రీకరణ దాదాపు పూర్తి అయింది. ఫస్టాఫ్ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశా. సెకండాఫ్ కోసం డబ్బింగ్ చెబుతున్నా. మై గాడ్.. ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ అంతకు మించి ఉంటుంది. Also Read : బ్లాక్ డ్రెస్ లో ఫిట్ నెస్ ఫ్రీక్ అందాలు అదుర్స్..! Also Read : మరోసారి హోస్ట్ గా దగ్గుబాటి రానా.. బాలయ్యకు పోటీగా టాక్ షో బాధగా ఉంది.. మాటల్లో చెప్పలేకపోతున్నా. మీరు తప్పకుండా మైండ్ బ్లోయింగ్ అనుభూతిని పొందనున్నారు. ఈ చిత్రాన్ని మీకు చూపించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. షూట్ పూర్తి అవుతున్నందుకు బాధగా ఉంది..' అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో రష్మిక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టును బన్నీ ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. Also Read : మెగాస్టార్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న 'పుష్ప' విలన్.. ఏ సినిమానో తెలుసా? ఇక 'పుష్ప' పార్ట్-1 సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో లవర్స్ గా కనిపించిన బన్నీ, రష్మిక.. పార్ట్-2 లో భార్య, భర్తలుగా అలరించనున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కేలవం ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టినట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా సుమారు 12,000 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. Also Read : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో మరో స్టార్ హీరో..? #tollywood #actress-rashmika-mandanna #pushpa2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి