Rajasthan: పోలింగ్ అధికారి చెంప చెల్లుమనిపించిన అభ్యర్థి

రాజస్థాన్‌‌లో ఖాళీగా ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డియోలి-ఉనియారా అసెంబ్లీ నియోజకవర్గంలోని సంరవత పోలింగ్ కేంద్రలో స్వతంత్ర అభ్యర్థి నరేశ్ మీనా SDM అమిత్ చౌదరిని చెంపదెబ్బ కొట్టాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది.

New Update
Rajasthan Official Slapped

సాధారణంగా ఎలక్షన్ టైంలో ఎన్నో వివాదాలు చోటుచేసుకుంటాయి. ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఎలక్షన్లలో చూస్తునేం ఉంటాం. ఇక ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. పోలింగ్ అధికారిపై అభ్యర్థి దాడికి దిగాడు. విధుల్లో ఉన్న అధికారి చెంప వాయించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అనే విషయానికొస్తే.. 

రాజస్థాన్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 7 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డియోలి-ఉనియారా అసెంబ్లీ నియోజకవర్గంలోని సంరవత పోలింగ్ కేంద్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేశ్ మీనా పోలింగ్ కేంద్రం వద్ద హాల్ చల్ చేశాడు. 

Also Read :  కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

ఎన్నికల ప్రోటోకాల్‌ను పర్యవేక్షించడానికి డ్యూటీలో ఉన్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) అమిత్ చౌదరిని చెంపదెబ్బ కొట్టాడు. ఎన్నికల్లో అతడు అక్రమానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఆగ్రహంతో దాడి చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదే సమయంలో పక్కనే ఉన్న పోలీసులు వెంటనే వచ్చి నరేశ్ మీనాను అడ్డుకున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నరేశ్ మీనా తీరుపై పలువురు మండిపడుతున్నారు.

Also Read :  రేష‌న్ మాఫియాపై ఉక్కుపాదం.. 1010 క్రిమినల్ కేసులు నమోదు!

ఉప ఎన్నికకు కారణం?

2018, 2023లో డియోలీ-ఉనియారా నియోజకవర్గం సీటును గెలుచుకున్న కాంగ్రెస్ నాయకుడు హరీష్ చంద్ర మీనా.. సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఆయనకు లోక్‌సభలో స్థానం కల్పించింది. దీంతో ఆ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహించారు.

Also Read : కేటీఆర్ అరెస్టుకు డేట్‌ ఫిక్స్!

పార్టీ నుంచి సస్పెండ్

ఈ ఉప ఎన్నికల్లో నరేశ్ మీనా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. నరేశ్ మీనాని కాదని అధిష్టానం కేసీ మీనాను అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేశ్ మీనా.. భారత్ ఆదివాసి పార్టీ సపోర్ట్‌తో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ విషయం తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నరేశ్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది.

Also Read :  హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు