/rtv/media/media_files/2025/05/22/NkIwKSl2cTpKMiAZWTUN.jpg)
Bharat Biotech's cholera vaccine successfully completes Phase-III trials
భారత్ బయోటెక్ కలరా టీకా అయిన హిల్‌కాల్‌ను అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీకా మూడో దశ క్లినికల్ పరీక్షల్లో సక్సెస్ అయ్యింది. కలరా వ్యాధికి కారణమయ్యే ఇనబా సెరోటైప్, ఒగావా.. ఈ రెండింటి పైనా కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు నిర్ధరించారు. ఈ హిల్‌కాల్ టీకా అనేది నోటి ద్వారా తీసుకునేది. ఈ టీకాపై జరిపిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను సైన్స్ డైరెక్ట్‌కు చెందిన వాక్సిన్ జర్నల్ ప్రచురించింది.
Also Read: మరో పాకిస్తాన్ హై కమిషన్ ను బహిష్కరణ..24 గంటల టైమ్
భారత్‌లోని మొత్తం 10 ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు కలిపి 1800 మందిపై ఈ టీకా పరీక్షలు నిర్వహించారు. టీకా తీసుకున్న వాళ్లలో రోగ నిరోధక శక్తి పెరిగింది. వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు బయటపడలేదు. దీంతో ఈ హిల్‌కాల్ టీకా సురక్షితమైనదని తేలింది. అయితే ఈ సమాచారాన్ని భారత్ బయోటెక్ నియంత్రణ సంస్థలకు అందించి.. తుది పర్మిషన్ పొందుతుంది. ఆ తర్వాత ఈ టీకా మార్కె్ట్‌లోకి వస్తుంది.
కలరా వ్యాధిని టీకాతో కంట్రోల్ చేయొచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. టీకా ఎక్కువగా అందుబాటులో లేకపోవడం సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ హిల్‌కాల్ టీకాతో కలారాను వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని, తక్కువ ఖర్చులోనే ఈ లభిస్తుందని పేర్కొన్నారు.
Also Read: అసలే ఎండకాలం, పైగా కరెంట్ కోతలు.. ఏటీఎంలో చల్లగా ఉంటుందని అంతా అక్కడికెళ్లి..
మరోవైపు కల్తీ ఆహారం, నీరు వల్ల కలరా వ్యాధి వ్యాపిస్తోంది. ప్రతీ ఏడాది 28 లక్షల మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. ఇందులో దాదాపు 95 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నోటితో తీసుకునే ఈ కలరా టీకా అమ్మకాలు కూడా ఏటా 10 కోట్ల డోసులు వరకు మాత్రమే వస్తున్నాయి. ఒకే కంపెనీ టీకాను అందిస్తుండటం వల్ల వీటి కొరత దేశంలో ఎక్కువగా ఉంది. అందుకే భారత్ బయోటెక్.. హైదరాబాద్, భువనేశ్వర్‌లోని తమ యూనిట్లలో ఏడాదికి గాను 20 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
cholera | vaccine | telugu-news | rtv-news