Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి కలరా టీకా.. క్లినికల్ పరీక్షల్లో విజయవంతం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోన్న కలరా టీకా అయిన 'హిల్కాల్' మూడో దశ క్లినికల్ పరీక్షల్లో సక్సెస్ అయ్యింది. కలరా వ్యాధికి కారణమయ్యే ఇనబా సెరోటైప్, ఒగావా.. ఈ రెండింటి పైనా కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు నిర్ధరించారు.