Delhi: మరో పాకిస్తాన్ హై కమిషన్ ను బహిష్కరణ..24 గంటల టైమ్

న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ నుంచి మరో అధికారిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. 24 గంటల్లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది. తన హోదాకు తగ్గట్టుగా నడుచుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

New Update
pak

Pakistan High commission

పాకిస్తాన్ హైకమిషన్ లోని ఓ అధికారిని పర్శనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించారు. ఇతనిని విధుల నుంచి బహిష్కరించడమే కాకుండా దేశం విడిచి వెళ్ళిపోవాలని కూడా చెప్పారు. 24 గంటల్లో తమ దేశానికి వెళ్ళాలని ఆదేశించారు.  ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. ఈ నెలలో ఇది రెండోసారి బహిష్కరణ. మే 13న.. ఓ పాకిస్థాన్ అధికారిని భారత్ బహిష్కరించింది.

రెండవసారి బహిష్కరణ..

దీంతో పాటూ పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ కు ఈరోజు ఈ మేరకు ఒక ఉత్తర్వు కూడా జారీ చేశారు. భారతదేశంలోని పాకిస్తాన్ దౌత్యవేత్తలు లేదా అధికారులు ఎవరూ తమ ప్రత్యేకాధికారాలు, హోదాను ఏ విధంగానూ దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రస్తుత అధికారి తన పదవికి విరుద్ధంగా కార్యకలాపాలను నిర్వర్తించనందువల్లనే అతనిని బహిష్కరించామని విదేశాంగ శాఖ తెలిపింది. ఆపరేషన్ సిందూర్' విజయవంతంగా నిర్వహించడం గురించి భారత సైనిక సీనియర్ అధికారి రక్షణ శాఖకు మరియు దాదాపు 70 దేశాల ప్రతినిధులకు వివరించిన కొద్దిసేపటికే ఈ పరిణామం జరిగింది. వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందం ప్రకారం ఒక దేశం విదేశీ వ్యక్తిని ఎప్పుడైనా నాన్ గ్రాటాగా ప్రకటించవచ్చును. దీనికి వివరణ కూడా ఇవ్వాల్సి అవసరం లేదు. 

పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు దేశాల దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ పై అనే చర్యలను తీసుకుంది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ పరిమాణాన్ని 55 నుంచి 30 మంది సభ్యులకు తగ్గించింది. దీర్ఘకాలంగా ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే ఇస్లామాబాద్ లో ఉన్న భారత దౌత్యవేత్తను కూడా వెనక్కు పిలిపించారు.  

 today-latest-news-in-telugu | new-delhi

Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు