Cholera : ఆ దేశం వెన్నులో వణుకు...100 దాటిన మరణాలు...!!
కలరా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కలరాతో వందకుపైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. మరో 905మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతమైందనుకున్న కలరా మళ్లీ విధ్వంసం సృష్టిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ కూడా ఆశ్చర్యపోయింది.