Bandi Sanjay: అంతా మీ ఇష్టమేనా.. 10వ తరగతి పరీక్షలపై బండి సంజయ్ ఫైర్

తెలంగాణలో ప్రీ ఫైనల్‌ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్ష సమయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. పరీక్ష సమయాన్ని గంట ముందుకు ఎందుకు జరిపారంటూ రాష్ట్ర విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
BANDI SANJAY

BANDI SANJAY

తెలంగాణలో ప్రీ ఫైనల్‌ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్ష సమయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. పరీక్ష సమయాన్ని గంట ముందుకు ఎందుకు జరిపారంటూ రాష్ట్ర విద్యాశాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు షెడ్యూల్ మారుస్తున్నారని అధికారులపై ఫైర్ అయ్యారు. వెంటనే పదవ తరగతి పరీక్షల టైమ్‌ టేబుల్‌ను మార్చాలంటూ డిమాండ్ చేశారు.  

Also Read: మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం..ఆ రోజున 14 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్‌

మార్చి 6న ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. మార్చి నాటికి ముగియనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 1.15 PM నుంచి సాయంత్రం 4.15 PM గంటల వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఫిజికల్ సైన్స్‌, బయోలాజికల్ సైన్స్‌ పరీక్షలు గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు. అయితే పరీక్ష సమయాన్ని గంట ముందుకు మార్చడంపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టైం టేబుల్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. 

Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

అలాగే ప్రీ ఫైనల్ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే టీఎస్‌ ఎస్ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. SSC బోర్డు పరీక్షల షెడ్యుల్‌ను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో చూసుకుంటే పదవ తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 31న ముగియనున్నాయి. 

Also Read: నువ్వేం మంచి చేశావని మైకులో చెప్తరు..రేవంత్ పై కేటీఆర్‌ ఎద్దేవా

Advertisment
తాజా కథనాలు