/rtv/media/media_files/2025/03/14/7xmHDrW2JYhhIBoGk7Jb.jpg)
Bandi Sanjay Kumar
Bandi Sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా 2017 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారిణి డాక్టర్ గడ్డం పూజిత బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కేబీఆర్ పురం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో 2009 నుంచి 2015 వరకు ఎంబీబీఎస్ చదివారు. 2015లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా కనిపించాలంటే ఇలా చేయండి
Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై
ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఏడాది పాటు రుయా ఆస్పత్రిలో హౌస్ సర్జన్‌గా సేవలు అందించారు. అయితే ఆమెకు సివిల్స్ మీద ఉన్న ఆసక్తితో సివిల్స్ చేశారు. డా.పి.వి లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకున్న పూజిత 2017లో ఐఆర్‌ఎస్ పూర్తి చేశారు. సివిల్స్‌లో 282 ర్యాంక్ సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం డైరెక్టరెట్ ఆఫ్ టాక్సెస్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా గడచిన ఏడు సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. అయితే ఆమె ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పూజితను ప్రస్తుతం డిప్యూటేషన్ పై కేంద్ర హోమ్‌శాఖ లో అడిషనల్ ప్రైవేట్ సెక్రెటరీగా నియమించారు.
Also Read : పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!
Also read : రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?
పూజిత భర్త మోహన్‌కృష్ణ భారత వాయుసేనలో స్క్వాడ్రన్ లీడర్‌గా పని చేస్తున్నారు. పూజిత ప్రతిభా పాటవాలు తెలుసుకున్న బండి సంజయ్ మహిళా అభ్యున్నతి, మహిళల భద్రతా అంశాల్లో సేవలు వినియోగించుకోవడానికి ఎంపిక చేసుకున్నారు.
Also Read: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!
Also Read : ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!