బంతి సుప్రీంకోర్టులో.. ఆర్టికల్ 370 రద్దుపై నేడు రాజ్యాంగ ధర్మాసనం విచారణ..!!
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ్టి(ఆగస్టు2) నుంచి విచారణ చేపట్టనుంది. గత జూలై 11న, ఆర్టికల్ 370పై విచారణకు ఫ్రేమ్వర్క్ను నిర్దేశించిన సుప్రీంకోర్టు, ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణలను కోరింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్లో అభివృద్ధి, పురోగతి, భద్రత పెరిగినట్టు కేంద్రం వాదిస్తోంది.