/rtv/media/media_files/2025/03/14/P4ytgkelB0zoBqLQT6NP.jpg)
పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం ఎదురైంది. హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు. డ్రాఫ్ట్‌లో మొత్తం 45 మంది పాక్ పురుష ఆటగాళ్లు, 5 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా వీరిలో ఒక్కరిపై కూడా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. గత సీజన్‌లో అత్యధిక ధర పలికిన నసీమ్ షాను కూడా పట్టించుకోలేదు. ఇక అయూబ్, ఇమాద్ వసీం, హసన్ అలీ, మహ్మద్ హస్నైన్‌లను కూడా తిరిగి తీసుకోలేదు.
No Pakistani players were picked in The Hundred 2025 draft primarily due to concerns about their availability during the tournament window, which overlaps with Pakistan's scheduled series against West Indies and potentially Bangladesh from late July to mid-August. Additionally,…
— Ask Perplexity (@AskPerplexity) March 13, 2025
భారత్ పెట్టుబడులే కారణం?
కాగా మొత్తం 8 జట్లలో నాలుగింటిలో భారత్ పెట్టుబడులు ఉండటం వల్ల వారిని కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. దీనికి తోడు పాక్ ఆటగాళ్లు కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడటం మరో కారణంగా తెలుస్తోంది. టోర్నమెంట్ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పురుషుల క్రికెటర్లకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. హండ్రెడ్ లీగ్‌లో పాక్ ఆటగాడు ఉసామా మిర్ అత్యధికంగా 13 మ్యాచ్‌లు ఆడగా.. హరీస్ రౌఫ్ 12, ఇమాద్ వసీం 10, మహ్మద్ అమిర్ 6, షాహీన్ అఫ్రిది 6, మహ్మద్ హస్నైన్ 5, జమాన్ ఖాన్ 5, షాదాబ్ ఖాన్ 3, వాహబ్ రియాజ్ 2 మ్యాచ్‌లు ఆడారు. ఇక అటు 2008 ఉగ్రవాద దాడుల తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ళు ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు.
జేమ్స్ ఆండర్సన్‌కు చుక్కెదురు
ఇక హండ్రెడ్ లీగ్-2025 డ్రాఫ్ట్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్, ఆఫ్ఘనిస్తాన్ యంగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ లు ఏకంగా జాక్‌పాట్ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్ రన్నరప్ సధరన్ బ్రేవ్ దక్కించుకోగా.. నూర్ అహ్మద్‌ను మాంచెస్టర్ ఒరిజినల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు ఇంగ్లండ్ మాజీ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. అతన్ని డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
Also read : హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !