Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై

జనసేన 12వ ఆవిర్భవ దినోత్సవ సభ పిఠాపురంలో జరుగుతుంది. 2014 మార్చి 14 పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించాడు. ఒంటరిగా పోటీ చేసి 2019లో 175 స్థానాల్లో పోటీ చేస్తే ఒకే సీటు గెలిచింది. TDPతో పొత్తు పెట్టుకొని 2024లో 21 సీట్లు గెలిచింది.

author-image
By K Mohan
New Update
janasena 123

janasena 123 Photograph: (janasena 123)

చుట్టూ చీకటి ఉన్నా.. వెలిగే కిరణం అతడు. తెగబడే అల ఎదురైతే తలపడే తీరం అతడు. పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే. ఇలాంటి పాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. అలాగే అతని ప్రసంగాలు విన్నా అంతే. పదునైన మాటలు, డైలాగ్స్‌తో  కోట్ల మంది అభిమానులు సంపాధించుకున్నాడు. జనం తరుపున కొట్లాడే జనసేనానిగా రాజకీయాల్లోకి వచ్చాడు. సరిగ్గా నేటికి జనసేనా పార్టీ పెట్టి 12ఏళ్లు. జనసేన ఆవిర్భవ సభ జయకేతనం పేరుగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో భారీ ఏర్పాట్లతో సిద్ధమైంది. జనసేనతో పవనన్న 12ఏళ్ల ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం..

జనసేన పార్టీ ప్రకటన

పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితే ఓ పవర్. ఆ కటౌట్ స్క్రీన్‌పై కనిపిస్తే కేకలే. టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాల్లోయింగ్ ఇన్న కొణిదల పవన్ కళ్యాన్ 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపిస్తున్నట్లుగా ప్రకటించాడు. హైదరాబాదు నగరం మాదాపూర్ ప్రాంతంలోని హైటెక్ సిటీ సమీపంలో నోవాటెల్ భవనంలో ఆవిర్భావ సభ నిర్వహించాడు. ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని స్థాపిస్తున్నానని ప్రకటించారు. ఆయన 2014 మార్చి 10న ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ పేరు నమోదు కోసం దరఖాస్తు చేశారు. 2014 డిసెంబరు 11న ఎన్నికల సంఘం దీనిని ఆమోదించింది. దీంతో 2019 ఏపీ అసెంబ్లీ  ఎన్నికలలో పోటీ ఖారారు అయింది. జనసేనా పార్టీ జెండా చేగువేరా విప్లవ స్పూర్తిలా ఉంటుంది. తెల్ల జెండాపై ఆరు మూలాలున్న నక్షత్రం రెడ్ కలర్‌లో గీసి ఉంటుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్, సభ్యుడిగా నాగబాబులను నియమించాడు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పార్టీ స్థాపించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపీతో ఫ్రెండ్లీగానే ఉన్నారు. పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలకు సమయం తక్కువగానే ఉండటంతో 2014 ఎన్నికల పోటీకి దిగకుండా బీజేపీకి మద్దతు పలికారు. తెలుగుదేశం కూడా NDA కూటమిలో ఉండటంతో ఏపీలో టీడీపీ విజయం కోసం పనిచేశారు. అలా పవన్‌ తీసుకున్న నిర్ణయం విభజన అంనతరం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడింది. టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో పవన్ విభేదించారు. ప్రత్యేకహోదా విషయంలోనూ గట్టిగా గళం వినిపించిన పవన్‌, బీజేపీతోపాటు, టీడీపీపైనా విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కాకుండా వామపక్షాలు, BSPతో కలిసి పోటీచేశారు.

175 మందికి ఒక్కడే..

ఆంధ్ర ప్రదేశ్‌ గ్రౌండ్ లెవల్‌లో ఉన్న సమస్యలను లేవనెత్తుతూ పవన్ కళ్యాణ్ పని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి, మూడేళ్ళ తర్వాత అది సాధ్యం కాదని తెలుపటం పై జనసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో ఈ విషయమై జనసేన బహిరంగ సభలను నిర్వహించింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ  175 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ.. ఘోర పరాజయమైంది. ఒక్క సీటు కూడా గెలపలేకపోయింది. ప్రచారంలో పవన్ జనసైనికులు ఎంత శ్రమించినా ఫలితం దక్కలే. పవన్ కళ్యాణ్‌ ఎక్కడ మీటింగ్ పెట్టినా జనం కుప్పలు కుప్పలుగా వచ్చే వారు. అయితే పవన్‌కు ఉన్న క్రేజ్ చూసి ఓ 10 సీట్లైనా గెలుస్తాడని అనుకున్నారు. కానీ. ఫలితాల రోజు సీన్ రివర్స్ అయ్యింది.  పవన్ కళ్యాణే గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. 175 మందిలో  తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి ఒక్కడే విజయం సాధించారు.

ఎంత ఘోరంగా ఓటమిపాలైయ్యాడో.. పవన్ కళ్యాణ్ అంతే పట్టుదలతో పని చేశాడు. 2019లో ఓటమికి కారణాలను అంచనా వేసి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ, టీడీపీ, జనసేనా పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేశాయి. జనసేనకు 21 సీట్లు కేటాయించారు. 100% 21కి 21 స్థానాల్లో విజయం సాధించింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు. 

పార్టీలో వివాదాలకు కేంద్రంగా కొందరు

పొత్తుల్లో భాగంగా కొన్ని చోట్ల సీట్లు దక్కనివారిలో కొందరికి నామినేటెడ్ పదవుల ద్వారా పవన్‌ న్యాయం చేశారు. పార్టీ నేతలపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడానికీ పవన్ వెనుకాడటం లేదు. జానీ మాస్టర్‌, కిరణ్‌ రాయల్‌ వంటి వివాదాలకు కేంద్రంగా నిలిచినవారికి పార్టీ దూరం పెట్టింది. ఓ మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి తమ్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇలా పార్టీలో క్రమశిక్షణ చర్యలు వెంటనే ఉంటున్నాయి.

ప్రస్తుతం 10 లక్షల జనసైనికులు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు 10 లక్షలు దాటినప్పటికీ గ్రామస్థాయి నుంచి కమిటీలు లేకపోవడం పార్టీ బలోపేతానికి సవాలుగా మారింది. జనసేన 12వ ఆవిర్భావ సభ ద్వారా పార్టీ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని శ్రేణులు ఆశిస్తున్నాయి. ఇన్నాళ్లూ రాజకీయపార్టీగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇప్పుడు 12వ ఆవిర్భావ సభను అధికారంలో ఉన్న పార్టీగా నిర్వహించుకోవడం జనసైనికుల్లో రెట్టించిన ఆనందోత్సాహాలను నింపుతోంది.

థాంక్యూ పిఠాపురం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు