Balagam : బలగం సినిమా రిపీట్.. 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి ఒక్కటైన అన్నదమ్ములు

కుటుంబ అనుబంధాలను అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బలగం. ఆ సినిమా కథనమే రాజన్నసిరిసిల్లలో రిపీట్ అయింది. కొలనూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మనస్పార్థాలతో విడిపోయారు. పదేండ్లుగా మాటలు లేని 60 ఏండ్ల వృద్ధులు మాట్లాడుకొని బలగం చిత్రాన్ని గుర్తు చేశారు.

New Update
Balagam movie repeat

Balagam movie repeat

Balagam : పెద్ద తారాగణం లేకుండా వచ్చిన బలగం సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను ఈ చిత్రం తెరకెక్కించింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేసి మరీ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. చిత్రంలో అన్నదమ్ములు కలసుకునే సమయంలో వచ్చే పాట ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. కుటుంబం, బంధాలు, బంధుత్వాల విలువలు గురించి కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రానికి కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించి తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ సినిమా ప్రభావం జనాల పై బాగా పనిచేసింది. చిత్రం చూసిన వారిలో విడిపోయిన చాలా మంది అన్నదమ్ములు ఒకటయ్యారు. అలాంటిదే ఇప్పుడు మరో అన్నదమ్ముల జంట విషయం తెరపైకి వచ్చింది. అనేక ఏండ్లుగా మనస్పార్థాలతో దూరమైన అన్నదమ్ములు 60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి మాట్లాడుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!
 
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని  కోనరావుపేట మండలం, కొలనూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు. వీరిద్ధరూ ఒకే గ్రామంలో ఉంటునప్పటికీ పదేండ్ల క్రితం చిన్నచిన్న గొడవలతో విడిపోయారు. దీంతో ఇద్దరిమధ్య మాటలు లేవు. ఒకరినొకరు ఎదురుపడ్డ శత్రువుల తీరు చూసుకోవడం తప్ప మాట్లాడుకున్నది లేదు. అయితే వీరిద్దరి మధ్య రాజీ కుదుర్చాలని నాగయ్య కుమారుడు   శ్రీనివాస్ ఎన్నో సార్లు ప్రయత్నించిన ఇద్దరూ పంతాలకు పోయి వినలేదు. ఆయన కూడా విసుగొచ్చి వదలేశాడు.   

ఇది కూడా చదవండి: BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..

ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మరణించిన రోజు ఇద్దరూ వెళ్లినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. అయితే మూడు రోజుల కార్యానికి కూడా అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలో వారిద్దరినీ కలపాలని ప్రయత్నించిన కొడుకు శ్రీనివాస్‌ మరోసారి వారి పాత రోజులు, జ్ఞాపకాలను గుర్తు చేశాడు. దీంతో భావోద్వేకానికి గురైన అన్నదమ్ములిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆరు పదుల వయసులో, కాటికి వెళ్లే ముందు ఇద్దరికీ పంతాలు ఎందుకని, ఇక నుంచి ఇద్దరం  కలిసి బ్రతుకుదాం అని యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆలింగనం చేసుకుని కంట తడి పెట్టుకున్నారు. పదేండ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసిన కలవని ముసలి అన్నదమ్ములిద్దరూ కలవడంతో అక్కడున్న వారంతా అనందభాష్పాలు రాల్చారు.

ఇది కూడా చదవండి: Balagam Actor: దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్.. గొంతు ఇన్ఫెక్షన్తో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు