/rtv/media/media_files/2025/10/29/ap-govt-to-provide-financial-aid-to-cyclone-victims-2025-10-29-13-55-34.jpg)
AP govt to provide financial aid to cyclone victims
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీలో పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బాధితుడికి వెయ్యి రూపాయిల చొప్పున ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. కుటుంబంలో ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3 వేలు సాయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read: బీహార్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. దూసుకొస్తున్న సైలెంట్ వేవ్.. ఆ కూటమికి ఊహించని షాక్?
బాధితులు పునరావాస కేంద్రం నుంచి తమ సొంత ఇళ్లకు వెళ్లే ముందు ఈ ఆర్థిక సాయం అందించాలని సూచించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ఖమ్మంలో మొంథా తుపాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. అక్కడ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Follow Us