/rtv/media/media_files/2025/08/23/gandhi-hospital-2025-08-23-20-27-32.jpg)
Gandhi Hospital
Gandhi Hospital : కొంతమందికి ఆవేశం వస్తే తట్టుకోలేరు. ఆ సమయంలో వారు ఎవరూ చెప్పినా వినరు. అంతేకాదు. కొన్ని సమయాల్లో వారు తీసుకునే నిర్ణయాలు చావువరకు వస్తాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రాణాంతకంగా మారుతాయన్నది కూడా నిజం. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పెద్దలు చెబుతుంటారు. హైదరాబాద్‌లో ఓ ఆటోడ్రైవర్ అలాగే అవేశానికి పోయి ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకీ అతనేం చేశాడో తెలుసా?
మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మహమ్మద్ ఖాజా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దీంతో 8 షేవింగ్ బ్లేడ్ లను ముక్కలు చేసి మింగేశాడు. మింగనైతే మింగాడు కానీ, కొంత సమయానికే కడుపులో తీవ్రమైన నొప్పి రావడం మొదలైంది. దీంతో తాను బతకనని డిసైడ్ అయ్యాడు. ఇక ఏడవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు నానా తంటాలు పడి ఎటువంటి ఆపరేషన్ చేయకుండానే బ్లేడ్లను తీశారు. చాలా క్లిష్టమైన ఈ కేసులో సదరు ఆటోడ్రైవర్ ప్రాణాలను కాపాడి ప్రాణబిక్ష పెట్టారు. మూడు రోజుల్లో కడుపులోని 16 పదునైన బ్లేడ్ ముక్కలను సురక్షితంగా బయటకు రప్పించడం గమనార్హం.
ఇది కూడా చూడండి: VP Election: రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి.. ఎవరి బలం ఎంత? మైనస్ లు ఏంటి?
గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఖాజా పొట్టలో ఉన్న బ్లేడు ముక్కలను తొలగించడానికి సిద్ధమయ్యారు. ముందుగా ఎండోస్కోపీ చేయాలని భావించారు. అయితే బ్లేడు ముక్కలు కావడంతో వాటిని తొలగించే సమయంలో లోపల గాయమై రక్తస్రావం జరిగే అవకాశం ఉందని ఆలోచించారు. ఈ నేపథ్యంలో ఎండోస్కోపీ కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రోటాన్ పంప్ అనే ప్రత్యేక వైద్యప్రక్రియ ద్వారా ఖాజా పొట్టలో ఉన్న బ్లేడ్ ముక్కలను బయటకు రప్పించడంలో విజయం సాధించారు.
ఇది కూడా చూడండి:కేసీఆర్ స్వల్ప అస్వస్థత ? చికిత్స అనంతరం..
ఈ చికిత్స చేయడానికి ఖాజాకు ఆహారం, నీళ్లు ఏమి ఇవ్వకుండా ఇంట్రా వీనస్ ప్రక్రియ ద్వారా ద్రవాలను ఎక్కిస్తూ బ్లేడ్ ముక్కలు నెమ్మదిగా మల విసర్జన ద్వారా బయటకు వచ్చేలా ప్రయత్నం చేశారు. అలా మూడు రోజులపాటు సాగిన ఈ చికిత్సలో బ్లేడ్ ముక్కలన్ని బయటకు వచ్చేలా చేశారు. పూర్తిగా కడుపులో ఎటువంటి బ్లేడ్ ముక్కలు లేవని నిర్ధారించు కున్నాక వైద్యులు ఖాజాను డిశ్చార్జ్ చేశారు. కాగా ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండా ఖాజాకు వైద్యం అందించి ప్రాణాలను కాపాడిన తీరును పలువురు అభినందించారు.