Mirai Making Video: యంగ్ హీరో తేజ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. కెరీర్ మొదలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్ గా 'హనుమాన్' సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'మిరాయ్' సినిమా చేస్తున్నారు. అయితే నేడు తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం తేజ ఏ రేంజ్ లో సహసాలు చేశాడో ఈ వీడియోలో కనిపిస్తోంది.
The #MIRAI BTS is out, celebrating #TejaSajja’s birthday.
— Ramesh Bala (@rameshlaus) August 23, 2025
Watch him performing every stunt himself taking all the risks.
Dedication like this is rare to see 👏 pic.twitter.com/JeGgrfriqs
హనుమన్ తర్వాత తేజ సజ్జా చేస్తున్న రెండవ పాన్ ఇండియా సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది మిరాయి. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఇతర దేశీయా భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.
భారతీయ ఇతిహాసాలు, పురాతన అంశాలను ఒక ఆధునిక యాక్షన్ అడ్వెంచర్ కథకు జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో తేజ సూపర్ పవర్స్ కలిగిన ఒక యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో తేజ యాక్షన్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో అనిపించాయి. మానవ జాతి భవిష్యత్తును నిర్ణయించే తొమ్మిది గ్రంథాలను కాపాడే యోధుడిగా ఆకట్టుకున్నాడు. ఈ కథలో మంచు మనోజ్ శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఆసక్తికరంగా ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్థమైంది.
ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా .. జగపతి బాబు, శ్రియా శరన్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తికేయ 2 తర్వత కార్తీక్ నుంచి వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆద్యాత్మిక , పురాతన అంశాలతో తెరాకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. అంతేకాదు కార్తికేయ 2 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హీరో, ఉత్తమ సినిమాటో గ్రాఫర్ విభాగాల్లో సైమా అవార్డ్స్ వరించాయి. ఇప్పుడు మిరాయి తో కూడా కార్తీక్ తన చూపించబోతారా అనేది చూడాలి.