AP Crime: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
గుంటూరు జిల్లా బావాపేటలోని సాయిబాబా కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఎలుకలమందు ఇచ్చి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.