/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
KCR Health
KCR Health : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈ రోజు స్వల్ప అస్శస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో వెంటనే వైద్య బృందం ఫాంహౌజ్ కు చేరుకుంది. ఆయన పర్సనల్ డాక్టర్స్ వెంటనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంటే హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియగానే మాజీమంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. కాగా చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం కుదుట పడింది. ఆయన అస్వస్థత నుంచి కోలుకుంటున్నారని తెలుస్తోంది.
కాగా, ఆయన గత కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. జులై నెలలోనూ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. యశోధ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం రికవరీ అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో విశ్రాంతి పొందారు. ఆ తర్వాత తిరిగి ఫాం హౌజ్‌కు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన వరుసగా సమీక్షలు నిర్వహించారు. స్థానిక ఎన్నికల తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక, కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విషయమై పార్టీ శ్రేణులతో ఆయన సుదీర్ఘ చర్చలు జరిపారు. కాగా తిరిగి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also ReadCINEMA: మళ్ళీ తెరపైకి హీరో గోవిందా విడాకుల కేసు.. అసలు కథ చెప్పిన లాయర్ !