Sperm Donation : వీర్యదానం చేస్తున్నారా?  క్లినిక్‌లపై పోలీసుల దాడులు

సికింద్రాబాద్‌ లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో తండ్రి వీర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగిన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పెర్మ్ క్లినిక్‌లపై దాడులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

New Update
Sperm Donation

Sperm Donation

సికింద్రాబాద్‌ లోని సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌లో తండ్రి వీర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగిన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వీర్యదానం కోసం ఏర్పాటు చేసిన క్లినిక్‌లపై పోలీసులు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెర్మ్ క్లినిక్‌లపై దాడులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు

Test Tube Baby Center - Sperm Donation

హైదరాబాద్‌లో ఉన్న ఓ స్పెర్మ్‌ క్లినిక్‌పై పోలీసుల దాడులు నిర్వహించారు. ఇండియన్‌ స్పెర్మ్ టెక్ క్లినిక్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ క్లినిక్‌లో తనిఖీలు చేపట్టిన సిబ్బంది ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ క్లినిక్‌లో అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌ కోసం హైదరాబాద్‌లో స్పెర్మ్‌ సేకరిస్తున్నట్లు గుర్తించారు. అలాగే స్పెర్మ్‌ డొనేట్‌ చేసినవారికి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదే సమయంలో ఈ క్లినిక్‌కు అసలు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. ఈ క్లినిక్‌పై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

Also Read : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!

కాగా, ఒక మహిళా తన భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని ఓ మహిళ (Test Tube Baby Center) టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌ను ఆశ్రయించింది. అయితే.. వేరే వారి వీర్యకణాలతో వైద్యులు సంతానం కలిగించారు. సదరు దంపతులను అనుమానం వచ్చిన డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోగా, శిశువు డీఎన్‌ఏ వేరే వారిదిగా తేలింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నగరంలోని పలు టెస్ట్ ట్యూబ్ సెంటర్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో తాజాగా పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్లు, స్పెర్మ్‌ డొనేట్‌ సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్‌లపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పలువురు తమ సెంటర్లను మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు.

Also Read : తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?

Also Read :  బిగ్ రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడు రోజులు కుండపోత వర్షాలే!

case against shrishti test tube center in secunderabad | police raid srushti test tube baby center in secunderabad | Srishti Test Tube Centre | srushti test tube baby center in secunderabad | Srushti Test Tube Baby Center | sperm-donor

Advertisment
తాజా కథనాలు