/rtv/media/media_files/2025/07/25/telangana-cabinet-postponed-to-july-28-2025-07-25-10-20-17.jpg)
Telangana Cabinet postponed to July 28
ఈ రోజు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం(cabinet-meeting)లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Election 2025) విషయంలో ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Also Read : వారు కోరుకుంటే పార్టీ పెడుతా...పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
Are You Contesting As Sarpanch?
ఈ అంశంపై గతంలోనే చర్చ జరగగా తాజా సమావేశంలో చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని సవరించే దస్త్రంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. కాగా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో జరిపిన చట్ట సవరణను తెలంగాణ పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేశారు. దాన్ని అనుసరించి రాష్ట్రంలోనూ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసి సమర్పించగా మంత్రి ఆమోదించారు. ఈ సవరణను ఇవాళ మంత్రివర్గ సమావేశంలో సమర్పించడంతో చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అనంతరం గవర్నర్ ఆమోదానికి పంపనున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.
Also Read : పోలీసులు హై అలర్ట్... అక్కడ వందమంది రౌడీ షీటర్లు
Follow Us