/rtv/media/media_files/2025/10/21/jubilee-hills-by-election-2025-10-21-08-54-53.jpg)
Jubilee Hills
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. కాగా ఇప్పటికే నామినేషన్ ప్రక్రియతో పాటు నామినేషన్ పత్రాల పరిశీలన కూడా పూర్తయ్యింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు దూసుకుపోతున్నాయి. అయితే ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీలు, రోడ్‌షోలు, ఇతరాత్ర సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రశాంతంగా పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు అలర్ట్ అయ్యారు.
Also Read: తెలంగాణలో కొత్త లొల్లి.. మంత్రితో పంచాయితీ.. IAS రాజీనామా?
ఇక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా నియోజక వర్గంలో ఉన్న రౌడీషీటర్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి కిందికి వచ్చే టోలిచౌకి, గోల్కోండ, జూబ్లీహిల్స్, మధురానగర్, ఫిలింనగర్, బోరబండ, పంజగుట్ట, సనత్‌నగర్ తదితర ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషిటర్లను ఇప్పటికే బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో నేరాలను నియంత్రించడంతోపాటు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను అదుపులో ఉంచే కార్యక్రమంలో భాగంగా వారిని బైండోవర్ చేశారు.
Also Read : సర్పంచ్ గా పోటీ చేస్తున్నారా? ఈ గుడ్ న్యూస్ మీ కోసమే.. ఆ నిబంధనకు గుడ్ బై
అత్యంత ప్రముఖులతో పాటు, సినిమా వర్గాలు నివాసం ఉండే జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో సుమారు 100 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు మరో 50 మంది అనుమానితులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో రౌడీషిటర్లు, అనుమానిత వ్యక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా ఉండేందుకుగాను వారిని బైండోవర్ చేశారు. అంతేకాక వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవర్తన సరిదిద్దుకోవాలని, న్యాయస్థానంలో హామీపత్రంపై సంతకం చేయిస్తున్నారు. ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత ఈ హామీని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి రోజు నుంచే అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లను బైండోవర్ చేయడమే కాకుండా వారందరూ ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా..? నిత్యం వారి కార్యకలపాలు ఏంటీ అనే కోణంలో పోలీసులు నిఘా ఉంచారు.
Also Read : నవీన్ యాదవ్ ఓ రౌడీ.. కేసీఆర్ సంచలన ఆరోపణలు!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సోమాజీగూడ, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ తదితర ఏడు డివిజన్ల పరిధిలో 139 లొకేషన్లలో 407 పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేశారు. ఇందులో 57 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయి నిఘా ఏర్పాటు చేశారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్తో ఓటింగ్?: ఎలక్షన్ ఆఫీసర్ కీలక ప్రకటన!
Follow Us