Anushka Shetty Vedam: పంజాగుట్ట సర్కిల్‌లో అనుష్క పోస్టర్‌...కొంటే చూపులకు 40 యాక్సిడెంట్లు..

అనుష్కశెట్టి వేదం సినిమాకు 15 ఏళ్లు నిండాయి. కాగా అనాడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. దానివల్ల 40 కి పైగా ప్రమాదాలు జరిగాయని చిత్ర బృందం గుర్తు చేసుకుంది.

New Update
Anushka-shetty-vedam-poster

Anushka-shetty-vedam-poster

Anushka Shetty Vedam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టిది ప్రత్యేక స్థానం. ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల నటి. అందుకే అతి తక్కువ సమయంలోనే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటిగా రాణించగలిగింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకులు మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్, లాంటి స్టార్ హీరోల సరసను నటించి మెప్పించింది. అయితే వయసు పెరగడంతో పాటు చిన్ని హీరోలు, చిన్న సినిమాల ప్రభావంతో అనుష్క ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. బాహుబలి సినిమా తర్వాత మరే సినిమాలోనూ అనుష్క నటించలేదు. ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది.

Also Read:సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

అయితే అసలు విషయానికొస్తే చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిప్పటికీ వాటిలో వేదం సినిమా కూడా ఒకటి. అనుష్క కెరియర్లో గుర్తిండిపోయే సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఇందులో అనుష్క వేశ్య పాత్రలో నటించి అద్భుతమైన నటనను కనబరిచింది. ముఖ్యంగా తన అంద చందాలతో యువతను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం అనుష్కను స్టార్ గా నిలబెట్టింది. అయితే వేదం సినిమా రిలీజ్ అయ్యి నేటికీ సరిగ్గా 15 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేసుకున్నారు. అన్నింటికంటే  ఒకటి మాత్రం అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన అని చెప్పుకోవచ్చు.

Also Read:ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

అదేంటంటే వేదం సినిమా నుంచి అనుష్క ధరించిన పసుపు రంగు చీర స్టిల్స్ ని ప్రమోషన్స్ లో బాగా ఉపయోగించారు. ఆ ఫోటోలో అనుష్క పసుపు రంగు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తూ మత్తెక్కించే చూపులతో యువతను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం విడుదల సమయంలో ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. అది చూడగానే ఆకట్టుకునేలా ఉండటం, అనుష్క కొత్తలుక్‌, అందులోనూ మత్తెక్కించే చూపులతో కవ్వించడంతో ఆ హోర్డింగ్‌ హైలెట్‌గా నిలిచింది. ఇంతవరకు భాగానే ఉంది. 

Also Read: విషాదం.. ఇంజెక్షన్‌ వికటించి అయిదుగురు మృతి..

కానీ  ఆ హోర్డింగ్ లో అనుష్కని చూస్తూ వాహనదారులు చాలామంది యాక్సిడెంట్స్ చేశారట. అలా అని ఒకటి రెండు ఏకంగా అనుష్క హోర్డింగ్ వల్ల దాదాపు 40 యాక్సిడెంట్ లు అయ్యాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాకపోయినా ఆ హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను గుద్దేసేవారట. దీంతో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరగడంతో పోలీసులు ఇది గమనించి GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట. అలా అనుష్క తన అందంతో అందర్నీ చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది ఆ సమయంలో. అలా ఈ సంఘటన కూడా అనుష్క కెరియర్ లో మరిచిపోలేనిదిగా నిలిచిపోయిందని చిత్ర బృందం అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

Also Read: కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి, వరుడికి గాయాలు

Advertisment
తాజా కథనాలు